పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా దాదాపు అందరూ ఏదో ఒక సమయంలో కడుపు నొప్పిని ఎదుర్కొనే ఉంటారు.ఇది చిన్న సమస్యే అయినప్పటికీ.
భరించలేనిదని చెప్పాలి.అందుకే కడుపు నొప్పి అంటేనే భయపడిపోతుంటారు.
అయితే కొందరు తరచూ కడుపు నొప్పికి గురవుతుంటారు.ఇందుకు మీరు చేసే కొన్ని తప్పులే కారణాలు అవుతుంటాయి.
అవేంటో లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.
షుగర్, షుగర్‌తో తయారు చేసిన ఆహారాలను అధికంగా తీసుకోవడం వల్ల కడుపులోని పేగులు దెబ్బ తింటాయి.
దాంతో తరచూ కడుపు నొప్పి వేధిస్తుంది.అందుకే షుగర్ మరియు షుగర్ ఫుడ్స్ తీసుకోవడం తగ్గించండి.
అలాగే ఫైబర్ లోపం కూడా కడుపు నొప్పికి కారణంగా చెప్పుకోవచ్చు.శరీరానికి సరిపడా ఫైబర్ అందకుంటే జీర్ణ వ్యవస్థ పని తీరు తగ్గిపోతుంది.దాంతో మలబద్ధకం, కడుపు నొప్పి వంటి సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది.
మద్యపానం వల్ల కూడా కొందరు తరచూ కడుపు నొప్పికి గురవుతుంటారు.కాబట్టి, ఇష్టంలేకున్నా, కష్టమైనా మద్యానికి దూరంగా ఉండండి.ఆరోగ్యంగా ఉండండి.
శరీరంలో నీటి శాతం తగ్గిపోయినప్పుడు కూడా కడుపు నొప్పి వేధిస్తుంది.జీర్ణ వ్యవస్థ సంక్రమంగా పని చేయాలంటే నీరు ఎంతో అవసరం.నీరు సరిగ్గా తీసుకోకుంటే.అనేక అనారోగ్య సమస్యలతో పాటు కడుపు నొప్పి కూడా ఇబ్బంది పెడుతుంది.
నిద్రను నిర్లక్ష్యం చేయడం వల్ల కూడా కడుపు నొప్పి వస్తుంది.శరీరానికి సరిపడా నిద్ర లేనప్పుడు ఒత్తిడి పెరిగిపోతుంది.
ఆ ఒత్తిడి వల్ల పొట్టలో తగినంత యాసిడ్ ఉత్పత్తి కాదు.తద్వారా గుండెలో మంట, కడుపు నొప్పి, కడుపు మంట వంటి సమస్యలకు తరచూ గురి కావాల్సి వస్తుంది.
ఇక మెగ్నీషియం లోపం, ప్రీ బయోటిక్ లోపం, వేగంగా ఆహారం తీసుకోవడం వంటి కారణాల వల్ల కూడా కడుపు నొప్పి పుడుతుంది.