ఆరు ఏళ్లు కాదు అరవై ఏళ్లు అయినా మరువం

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ఆరు సంవత్సరాల క్రితం వచ్చిన బాహుబలి సినిమా గురించి నేడు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది.సినిమా విడుదల అయ్యి నేటికి సరిగ్గా ఆరు ఏళ్లు అయ్యింది.

 Rajamouli Baahubali Movie Six Years Completed , Baahubali, Flim News, News In Te-TeluguStop.com

గత ఏడాది విడుదల అయిన సినిమా ల గురించే జనాలు మర్చి పోతూ ఉంటారు.అలాంటిది ఆరు సంవత్సరాల క్రితం విడుదల అయిన బాహుబలి సినిమా గురించి ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం.

నేడు ఆ సినిమా విడుదల అయిన రోజు అనే కాకుండా ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమా గురించి మాట్లాడే సమయంలో.తెలుగు సినిమాలను హిందీ వారు అభిమానిస్తున్నారు అంటూ చెప్పుకున్న ప్రతి సందర్బంలో కూడా బాహుబలి సినిమా గురించి చెబుతూనే ఉంటాం.

హిందీలోనే కాకుండా ఏ ఇతర ఇండియన్‌ భాషలో అయినా ఇప్పటి వరకు వరకు టాప్‌ సినిమా ఏంటీ అంటే బాహుబలి అంటూ ఉంటారు.

Telugu Baahubali, Telugu, Rajamouli-Movie

హిందీ సినిమాలకు కూడా అందనంత పెద్ద రికార్డును నమోదు చేసిన బాహుబలి సినిమాను ఆరు ఏళ్లు మాత్రమే కాదు అరవై ఏళ్లు అయినా కూడా తెలుగు వారు మర్చి పోరు.కేవలం తెలుగు వారు మాత్రమే కాకుండా ఇండియన్‌ సినీ అభిమానులు ఎవరు కూడా ఈ సినిమాను మర్చి పోలేరు అనడంలో సందేహం లేదు.అద్బుతమైన సినిమాలను జక్కన్న ఇప్పటికే ఎన్నో తెరకెక్కించాడు.

ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌.ఈ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది.

బాహుబలికి ఏమాత్రం తగ్గకుండా ఆ సినిమా రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లను దక్కించుకుంటుంది అంటూ చెబుతున్నారు.అద్బుతాలను ఆవిష్కరించడం లో జక్కన్న తర్వాతే ఎవరైనా.

అందుకే జక్కన్న ఈ సినిమాను మరో సారి ఇండస్ట్రీ హిట్ గా నిలుపుతాడనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.బాహుబలి సినిమా ను అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించినందుకు గాను జక్కన్నకు తెలుగు ప్రేక్షకులు ఎప్పటికి రుణపడి ఉంటారు అనడంలో సందేహం లేదు.

రాజమౌళి వంటి స్టార్‌ తెలుగులో సినిమాలు చేయడం అందరి అదృష్టం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube