ఎన్టీఆర్ కి ప్రేమకథ చెప్పి ఒప్పించిన అట్లీ

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేస్తాడనే విషయం గత కొన్నేళ్లుగా వినిపిస్తుంది.గతంలో వీరిద్దరు కూడా తమ కాంబినేషన్ లో సినిమా ఉంటుంది అనే విషయాన్ని మీడియాలో చెప్పుకొచ్చారు.

 Jr Ntr Falls In Love Of This Genre For Atlee, Tollywood, South Cinema, Rrr Movie-TeluguStop.com

అయితే ఈ ప్రాజెక్టు అఫీషియల్ గా మాత్రం ఇప్పటివరకు ఎనౌన్స్ కాలేదు.అట్లీ కూడా పలు సందర్భాల్లో తెలుగులో ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశం ఉందని కూడా రివీల్ చేశారు.

అయితే తారక్ వరుస సినిమాలతో బిజీ అవడం అట్లీ దర్శకత్వంలో చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చే అవకాశం దొరకలేదు.ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నటిస్తున్న తారక్ దాన్ని పూర్తి చేసి వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.దాని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ లో పాన్ ఇండియా మూవీకి ఓకే చెప్పిన సంగతి తెలిసిందే.ఈనేపథ్యంలో అట్లీ హిందీలో షారుక్ ఖాన్ తో తన నెక్స్ట్ సినిమాని ప్లాన్ చేసుకున్నారు.

ఈ సినిమా ఇప్పటికే అఫిషియల్ గా అనౌన్స్ అయింది.నయనతార ఈ మూవీలో షారుఖ్ ఖాన్ కి జోడిగా నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది.

ఇదిలా ఉంటే రీసెంట్ గా ఎన్టీఆర్ కలిసిన అట్లీ ఒక లవ్ స్టోరీని తారక్ కి నేరెట్ చేసినట్లు సమాచారం.ఇక కెరీర్లో ఇప్పటి వరకు ప్రేమకథలు చేయని తారక్ కి అట్లీ చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

Telugu Atlee, Jr Ntr, Rrr, Tollywood-Movie

అయితే సినిమా ఇద్దరి కమిట్మెంట్స్ పూర్తయిన తర్వాత తెరపైకి వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.ఇక ఈ సినిమాని తమిళంలో భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కిస్తున్న ప్రొడక్షన్ సంస్థ నిర్మించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది.త్వరలో దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ సర్కిల్ వినిపిస్తున్న మాట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube