తెలుగులో ప్రముఖ సంగీత దర్శకురాలు బి.జయ దర్శకత్వం వహించిన “చంటిగాడు” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయమైన ప్రముఖ హీరో “బాలాదిత్య” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
అయితే బాలాదిత్య చంటిగాడు చిత్రంలో హీరోగా నటించడానికంటే ముందుగా దాదాపుగా 6 భాషలలో 40 కి పైగా చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా నటించి ప్రేక్షకులను బాగా అలరించాడు.ఆ తరువాత చదువుల కోసం కొంత కాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు.
ప్రస్తుతం పలు ధారావాహికలు, సినిమాలలో అరకొర అవకాశాలతో పర్వాలేదనిపిస్తున్నాడు.కాగా తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో బాలాదిత్య పాల్గొని తన జీవితంలో ఎదుర్కొన్న గురించి గాసిప్స్ గురించి స్పందించాడు.
ఇందులో భాగంగా తాను చంటిగాడు సినిమాలో తనతో పాటు హీరోయిన్ గా నటించిన నటి సుహాసినితో తనకు లవ్ అఫైర్ ఉందని తొందర్లోనే తామిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నామాని అప్పట్లో కొందరు తప్పుడు కథనాలను ప్రచారం చేశారని తెలిపాడు.కానీ అసలు వాస్తవం ఏమిటంటే ఇప్పటికీ సుహాసిని తనకు చాలా మంచి స్నేహితురాలని చెప్పుకొచ్చాడు.
అంతేకాకుండా అప్పుడప్పుడు తామిద్దరం ఒకే కారులో ప్రయాణం చేస్తుంటామని దీంతో తాము ఇద్దరిని చూసినటువంటి కొందరు ఇలా తప్పుగా అనుకున్నారని తెలిపాడు.అలాగే తన వ్యక్తిగత జీవితంలో తన తల్లిదండ్రులు చాలా ఫ్రీడమ్ ఇచ్చారని అంతేకాకుండా తనకు నచ్చిన రంగంలో సెటిల్ అయ్యే అవకాశం కూడా ఇచ్చారని అందుకు గానూ తన తల్లిదండ్రులకు ఎంతగానో రుణపడి ఉంటానని తెలిపాడు.
అయితే అప్పట్లో ప్రముఖ సినీ దర్శకుడు బాల చందర్ దర్శకత్వం వహిస్తున్న ఓ సీరియల్ లో నటిస్తున్న సమయంలో తనని చెంపపై కొట్టారని కానీ ఆ సమయంలో తాను నేర్చుకున్న విషయాలు ఇప్పటికీ తన సినీ జీవితంలో చాలా బాగా ఉపయోగపడుతున్నాయని తెలిపాడు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో బాలాదిత్య చంటిగాడు రూమ్ మేట్స్, జాజిమల్లి, సంధ్య, వంశం, సుందరానికి తొందరెక్కువ, కీలుగుఱ్ఱం, వేట, 1940లో ఒక గ్రామం, తదితర చిత్రాలలో హీరోగా నటించాడు.ఇందులో 1940లో ఒక గ్రామం చిత్రానికి నంది అవార్డులతో పాటు నేషనల్ అవార్డు కూడా వరించాయి.కాగా ప్రస్తుతం ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి స్టార్ మా లో ప్రసారమయ్యే శాంభవి అనే ధారావాహిక లో బాలాదిత్య నటిస్తున్నట్లు సమాచారం.
అలాగే సావిత్రమ్మ గారి అబ్బాయి అనే మరో ధారావాహికలో కూడా హీరో పాత్రలో నటిస్తున్నాడు.