తరతరాలుగా వస్తున్న ప్రభాస్ ఆస్థి ఎంత.. ?

ప్రభాస్.తెలుగు సినీ పరిశ్రమ నుంచి బయటకు వచ్చిన ఈ నట దిగ్గజం.దేశం మెచ్చిన టాప్ హీరో అయ్యాడు.ఈశ్వర్ సినిమాతో తెలుగు వెండితెర మీద జిగేల్ మన్న ఈ యంగ్ రెబల్ స్టార్.ఇప్పుడు నేషనల్ స్టార్ గా కీర్తి గడించాడు.ఇండియన్ సినిమా సత్తా ప్రపంచానికి చాటిన బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది.

 Hero Prabhas Family Properties, Prabhas, Saho Cinema, Bahubali, Radhe Shyam Movi-TeluguStop.com

ప్రస్తుతం ఆయన వరుసబెట్టి పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నాడు.బాహుబలి తర్వాత సాహో సినిమా జాతీయ స్థాయిలో ప్రభాస్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

ప్రస్తుతం మరో మూడు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు.

ప్రస్తుతం ప్ర‌భాస్ నటిస్తున్న రాధే శ్యామ్‌ సినిమా, నాగ్ అశ్విన్ సైన్స్‌ ఫిక్ష‌న్ సినిమా, ఆది పురుష్ కూడా పాన్ ఇండియా సినిమాలుగానే రూపొందుతున్నాయి.

ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ఆదిపురుష్ తెర‌కెక్కుతున్నది.ఈ సినిమాలో ప్ర‌భాస్ శ్రీరాముడి పాత్ర‌లో యాక్ట్ చేస్తున్నాడు.ఈ సినిమా బ‌డ్జెట్ 100 కోట్ల రూపాయలు.బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీఖాన్ విల‌న్ లంకేశ్ పాత్రలో చేస్తున్నాడు.

Telugu Bahubali, Nag Ashwin, Prabhas, Radhe Shyam, Saho, Saif Ali Khan, Uv-Telug

ఇక ప్రభాస్ ఆస్తుల విషయానికి వస్తే చాలా ఉన్నాయట.ప్ర‌భాస్ ఇప్ప‌టి వ‌ర‌కు అటు సినిమాల‌తో పాటు ఇటు రియ‌ల్ ఎస్టేట్‌ లో ముందుకు సాగాడు.పలు ఇత‌ర వ్యాపారాల ద్వారా 13 మిలియ‌న్ డాల‌ర్లు సంపాదించాడ‌ట‌.వాస్త‌వానికి యూవీ క్రియేష‌న్స్ ప్ర‌భాస్ కు చాలా దగ్గరి మనుషులది.దీనిలో ఎక్కువ శాతం ప్రభాస్ పెట్టుబడులే ఉన్నట్లు సమాచారం.యువీ క్రియేషన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా సినిమా థియేటర్లను నడుపుతుంది.

పలు చోట్ల పెద్ద ఎత్తున స్క్రీన్లను ఏర్పాటు చేసింది.వీటిని సాహో సినిమాతో ప్రారంభింది.

అతి తక్కువ సమయంలో బిజినెస్ లో ప్రభాస్ సక్సెస్ ఫుల్ గా ముందుకు కొనసాగాడు అని చెప్పుకోవచ్చు.అంతేకాదు.

సినిమాల ద్వారా కూడా డబ్బు భారీగా సంపాదిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube