కరోనా: భారత్‌లో దిగిన ట్రంప్ వాడిన యాంటీబాడీ కాక్‌టెయిల్‌... ధర ఎంతో తెలుసా..?

భారతదేశం కోవిడ్ సెకండ్ వేవ్‌తో అల్లాడిపోతోంది.ప్రతిరోజూ లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి.

 Covid-19: Antibody Cocktail Used To Treat Trump Launched In India At Rs 59,750/d-TeluguStop.com

లాక్‌డౌన్, కర్ఫ్యూ వంటి ఆంక్షలతో వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.ఇది కొంత మేరకు సత్ఫలితాలను ఇస్తున్నాయి.

మరోవైపు ప్రజలను కరోనా నుంచి రక్షించాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని నిపుణులు చెబుతున్నారు.అయితే దేశీయంగా అందుబాటులో వున్న కోవిషీల్డ్, కొవాగ్జిన్‌ల డోసుల కొరత వేధిస్తుండటంతో రష్యా తయారు చేసిన స్పుత్నిక్ వీ కి భారత ప్రభుత్వం అనుమతినిచ్చింది.

అలాగే టీకా అనుమతి ప్రక్రియను మరింత సరళతరం చేసింది.ఇదే క్రమంలో డీఆర్‌డీవో అభివృద్ధి చేసీన ఔషధానికి అత్యవసర అనుమతినిచ్చింది.

అలాగే స్విట్జర్లాండ్‌ ఫార్మా దిగ్గజం రోచ్‌ అభివృద్ధి చేసిన యాంటీబాడీ కాక్‌టెయిల్‌కు భారత సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనుమతులు లభించాయి.

కొవిడ్‌ బాధితుల చికిత్సలో ఉపయోగించే యాంటీబాడీ కాక్‌టెయిల్‌ (కాసిరివిమాబ్‌, ఇమ్డివిమాబ్‌) భారత మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది.

ఔషధ తయారీ సంస్థ రోచ్‌ ఇండియా, సిప్లా సంయుక్తంగా ఈ ఔషధాన్ని మంగళవారం మార్కెట్‌లోకి విడుదల చేశాయి.దీని ధర డోసుకు రూ.59,750గా నిర్ణయించినట్లు వెల్లడించాయి.తొలి విడతలో భాగంగా లక్ష ప్యాక్‌లను మార్కెట్‌లోకి విడుదల చేశామని, జూన్‌ మధ్యలో రెండో బ్యాచ్‌ ప్యాక్‌లు అందజేస్తామని రోచ్‌ ఇండియా, సిప్లా ప్రకటించాయి.

ఒక్కో ప్యాక్‌ను ఇద్దరు రోగులకు అందించవచ్చని ఆ సంస్థలు ఓ ప్రకటనలో తెలిపాయి.

ఈ ఔషధాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాడారు.

అధ్యక్ష ఎన్నికల ప్రచారం ఉద్దృతంగా సాగుతున్న వేళ .ట్రంప్ కోవిడ్ బారినపడిన సంగతి తెలిసిందే.వృద్ధాప్యం, ఇతర అనారోగ్య సమస్యల నేపథ్యంలో ఆయన కోలుకుంటారా లేదా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి.కానీ వైద్యుల సూచన మేరకు యాంటీబాడీ కాక్‌టెయిల్‌ ఔషధాన్ని వాడటంతో ట్రంప్ వేగంగా కోలుకున్నారు.

ప్రస్తుతం భారత్‌లోని కల్లోలం నేపథ్యంలో ప్రజల ప్రాణాలను కాపాడటంతో పాటు వైద్య రంగంపై ఒత్తిడిని తగ్గించేందుకు ఈ కాక్‌టెయిల్ ఔషధానికి కేంద్రం అనుమతినిచ్చింది.దీనిని ప్రస్తుతానికి దిగుమతి చేసుకుని మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు.

సిప్లా దీనిని భారత్‌లో మార్కెటింగ్, పంపిణీ వ్యవహారాలను పర్యవేక్షించనుంది.ఈ ఔషధానికి అమెరికా, యూరోపియన్ యూనియన్‌లు ఇప్పటికే అత్యవసర వినియోగానికి అనుమతించాయి.

అక్కడి డేటా ఆధారంగానే సీడీఎస్‌సీవో భారత్‌లోనూ వినియోగానికి క్లియరెన్స్ ఇచ్చారు.

Telugu Cocktail, Cipla, Drdvo, Imdivimab, Kasiviri Mob, Roach India, Sputnik-Tel

కరోనాను ఎదుర్కొనే కాసివిరి మాబ్, ఇమ్డివిమాబ్‌ను కలిపి ఈ యాండీ కాక్‌టెయిల్‌ను అభివృద్ధి చేశారు.ప్రయోగశాలల్లో అభివృద్ధి చేసిన ఈ రెండు ప్రతినిరోధకాలను మోనోక్లోనల్‌ యాంటీ బాడీస్‌ అంటారు.ఇవి మనిషి శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థను అనుకరిస్తూ హానికారక వైరస్‌లను ఎదుర్కొంటాయి.

ఇక ప్రస్తుత కరోనా వైరస్‌లోని స్పైక్‌ ప్రోటీన్‌పై సమర్థవంతంగా పనిచేయడం ఈ యాంటీబాడీ ప్రత్యేకత.ఈ ప్రొటీన్‌ను అడ్డుకోగలిగితే.వైరస్‌ శరీరంలోని ఏసీఈ 2 కణాలకు అతుక్కోదు.కాసివిరి మాబ్, ఇమ్డివిమాబ్‌ యాంటీబాడీలు కలిసి స్పైక్‌ ప్రొటీన్లో ఒక ప్రత్యేకమైన భాగంపై పనిచేస్తాయి.

అంతేకాకుండా వైరస్‌లో మ్యుటేషన్లు ఏర్పడినా ఇది సమర్ధవంతంగా అడ్డుకుంటుంది.తక్కువ లక్షణాలు ఉన్న వారి నుంచి ఓ మోస్తరు లక్షణాలున్న వారికి ఈ ఔషధం బాగా పనిచేస్తుంది.2 డిగ్రీల నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతలో సాధారణ రిఫ్రిజిరేటర్లలో నిల్వ చేసుకోవచ్చు.ఒక్కో యాంటీబాడీ 600 ఎంజీ చొప్పున గల, 1200 ఎంజీ ఔషధ సమ్మేళనాన్ని వినియోగించాలి.

దీనిని చర్మం కింద ఉండే కండరంలోకి లేదా నరాలకు ఎక్కించవచ్చు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube