అభిరామ్ కోసం యాక్షన్ కథని ఎంచుకున్న తేజ

దివంగత రామానాయుడు నుంచి హీరోగా వెంకటేష్ ఇప్పటికే స్టార్ ఇమేజ్ అందుకొని సీనియర్ కేటగిరీలోకి చేరిపోయాడు.అలాగే నాగ చైతన్య ఇటు రామానాయుడు, అటు అక్కినేని ఫ్యామిలీ వారసుడుగా ఉన్నాడు.

 Director Teja Ready To Action Story For Abhiram, Suresh Productions, Tollywood,-TeluguStop.com

అలాగే సురేష్ బాబు తనయుడుగా రానా దగ్గుబాటి హీరోగా తెరంగేట్రం చేసి ఇండియన్ వైడ్ గా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.బాహుబలి సినిమాతో రానా ఇమేజ్ మరింత పెరిగిపోయింది.

ఇప్పుడు సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ కూడా హీరోగా తెరంగేట్రం చేయడానికి రెడీ అయ్యాడు.డైరెక్టర్ తేజ చేతుల మీదుగా సురేష్ బాబు అతన్ని లాంచ్ చేయబోతున్నాడు.

ఇప్పటికే ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయ్యింది.అఫీషియల్ గా స్టార్ట్ చేయడమే ఆలస్యం.ఇదిలా ఉంటే తేజ దర్శకత్వం అంటే ఎక్కువగా ప్రేమకథలే కనిపిస్తాయి.చాలా మంది కొత్త హీరోలని ప్రేమకథా చిత్రాలతోనే అతను టాలీవుడ్ కి పరిచయం చేశాడు.

అయితే అభిరామ్ విషయంలో తేజ మొదటి సారి తన జోనర్ మార్చి యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథని ఎంచుకున్నట్లు తెలుస్తుంది.ఇప్పటికే దీనికి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయినట్లు బోగట్టా.

ఇక క్యాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో ప్రస్తుతం ఉన్నారని తెలుస్తుంది.హీరోయిన్ గా ఓ కొత్త అమ్మాయిని పరిచయం చేసే ఆలోచనలో ఉన్నట్లు టాక్.

లాక్ డౌన్ తర్వాత ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.ఇక ఆర్పీ పట్నాయక్ మళ్ళీ ఈ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా తెలుగులో తన జర్నీ స్టార్ట్ చేయబోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube