ఇటీవల బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కరోనా వైరస్ బారిన పడినట్లుగా అందరికీ తెలిసిన విషయమే.ఈ విషయాన్ని స్వయంగా అక్షయ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ, తనను కలిసిన వారందరూ కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
అక్షయ్ కుమార్ ప్రధాన ప్రాతలో రామసేతు సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఐతే వాస్తవానికి నేటి నుంచి రామసేతు సినిమా షూటింగ్ ప్రారంభం అవ్వాల్సి ఉంది.ఈ క్రమంలో చిత్ర నిర్మాత అయిన విక్రమ్ మల్హోత్ర సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న వంద మంది జూనియర్ ఆర్టిస్టులను కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరడంతో వారిలో దాదాపు 45 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలుస్తుంది.
దీనితో ప్రస్తుతానికి రామసేతు సినిమా షూటింగ్ వాయిదా పడింది.మరో పదిహేను రోజులు పూర్తయిన తర్వాతనే సినిమా షూటింగ్ పై ఖచ్చిత నిర్ణయం తీసుకోలేమని నిర్మాత విక్రమ్ తెలియజేస్తున్నారు.గతంలో కూడా అక్షయ్ కరోనా వైరస్ గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టిన సంగతి మనకు తెలిసిందే, అలాగే కరోనా వైరస్ కట్టడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ.
ప్రజలకు అవగాహన కల్పించారు.అంతేకాకుండా గత సంవత్సరం కరోనా వైరస్ కట్టడి కోసం తన వంతు సహాయంగా సీఎం సహాయ నిధికి 25 కోట్ల విరాళం కూడా అందజేశారు.
తాజగా అక్షయ్ కుమార్ హాస్పిటల్ లో చేరినట్లు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా అక్షయ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
డాక్టర్ల సూచనల మేరకు ముందు జాగ్రత్త చర్యగా ఆసుపత్రిలో జాయిన్ అయినట్లు అక్షయ్ కుమార్ తెలియజేశారు.ఈ తరుణంలో “మీ అభిమానానికి నా కృతజ్ఞతలు.
మీ ప్రార్థనలు పనిచేస్తున్నాయి.నేను బాగానే ఉన్నాను.
ముందు జాగ్రత్త చర్యగా డాక్టర్ల సలహా మేరకు మాత్రమే ఆసుపత్రిలో జాయిన్ అయ్యినట్లు, అతి త్వరలోనే ఇంటికి తిరిగి వస్తారని ఆశిస్తున్నా” అంటూ అక్షయ్ కుమార్ ట్వీట్ చేసాడు.మరోవైపు దేశంలో రెండో దశ కరోనా వైరస్ ఉధృతి తీవ్ర స్థాయిలో ఉంది.
మహారాష్ట్రలో కూడా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతూ ఉండడంతో అక్కడా లాక్ డౌన్ విధించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.