బాలీవుడ్ లో చాలా మంది ప్రముఖుల మీద మీటూ ఉద్యమం మాటున లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.ప్రముఖ దర్శకులు సైతం ఈ ఆరోపణలలో ఇరుక్కున్నారు.
తనుశ్రీ దత్తా ముందుగా బయటకొచ్చి తనకు జరిగిన లైంగిక వేధింపులు గురించి చెప్పడమే కాకుండా వారి పేర్లు కూడా బయట పెట్టింది.ఆమెని అనుసరిస్తూ చాలా మంది తారలు మీడియా ముందుకి వచ్చి తమకి ఎదురైనా చేదు అనుభవాల గురించి షేర్ చేసుకున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు మరో హీరోయిన్ బాలీవుడ్ లో తన చేదు అనుభవాల గురించి మీడియాతో పంచుకుంది.ఆమె హీరోయిన్ ఎక్కువ సినిమాలు చేయకపోయినా సల్మాన్ ఖాన్ ప్రియురాలు అనే ట్యాగ్ మాత్రం సంపాదించుకుంది.
సల్మాన్ తో రిలేషన్ లో ఉన్న సమయంలో బాలీవుడ్ లో హీరోయిన్ గా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో తనకి లైంగిక వేధింపులు ఎదురయ్యాయని ఈ బాలీవుడ్ నటి సోమీ అలీ చెప్పుకొచ్చింది.
బాలీవుడ్‌లో సినిమాల కోసం ప్రయత్నం చేసే సమయంలో హిందీ చిత్ర సీమకు చెందిన ఇద్దరు డైరెక్టర్లు తనతో శృంగారం కోసం ప్రయత్నించారని సల్మాన్ సోమీ అలీ సంచలన విషయాన్ని బయట పెట్టింది.
తాజాగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె విషయాలు బయటపెట్టింది.బాలీవుడ్‌కు చెందిన ఇద్దరు డైరెక్టర్లు ఆ విషయంలో నన్ను బలవంతం చేసే ప్రయత్నం చేశారు.అయితే అప్పటికే తాను సల్మాన్ ఖాన్ తో భయంకరమైన రిలేషన్ షిప్‌లో ఉన్నాను.ఆ రిలేషన్ షిప్ అన్నింటికంటే స్ట్రాంగ్ అని ఆ సమయంలో అనిపించింది అని సోమీ చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం సోషల్ యాక్టివిటీస్ చేసుకుంటున్న ఈ అమ్మడుకి మళ్ళీ సినిమాలలోకి రీఎంట్రీ ఇచ్చే ఆలోచన ఉందా అని మీడియా ప్రశ్నించగా, ఇప్పుడు అలాంటి ఆలోచన, ఆసక్తి రెండూ కూడా లేవని తేల్చి చెప్పింది.