బిడెన్ టీమ్ లోకి మరో భారతీయురాలు...

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కు భారతీయులకు తన టీమ్ లో బ్రహ్మరధం పడుతున్నారు.ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 మంది భారతీయులను ఎంపిక చేసుకుని అత్యంత కీలకమైన భాద్యతలు అప్పగించిన బిడెన్ అమెరికా భవిష్యత్తును తీర్చిదిద్దే భాద్యతలు అప్పగించారు.

 Biden Appointed Another Indian American Solicitor For Labour Department , Bide-TeluguStop.com

ఎన్ని విమర్శలు ఎదురవుతున్నా భారతీయులను ఎంపిక చేయడంలో మాత్రం బిడెన్ మడమ తిప్పే ప్రయత్నం మాత్రం చేయడంలేదంటే మన వారిపై బిడెన్ కు ఉన్న నమ్మకం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇదిలాఉంటే తాజాగా అధ్యక్షుడు బిడెన్ మరో భారతీయురాలికి అత్యంత కీలక భాద్యతలు అప్పగించారు.

భారత సంతతి మహిళా న్యాయవాదిగా అమెరికాలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సీమా నందాను బిడెన్ కీలక పదవిగా భావించే అమెరికా కార్మిక శాఖ సొలిసిటర్ గా ఎంపిక చేశారు.ఈ మేరకు వైట్ హౌస్ నుంచీ ప్రకటన వెలువడింది.

ఆమె ఎంపికలో ఎలాంటి మార్పులు ఉండవని కూడా స్పష్టం చేసింది.అత్యంత అనుభవజ్ఞురాలైన సీమా ఎంపికపై బిడెన్ సంతృప్తి వ్యక్తం చేశారని ప్రకటించింది.

కాగా సీమా నందా ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కీలక భాద్యతలు చేపట్టారు.అప్పట్లోనే అమెరికా కార్మిక శాఖలో ఛీఫ్ ఆఫ్ స్టాఫ్, డిప్యుటీ సొలిసిటర్ గా అలాగే డిప్యుటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా పనిచేశారు.

అప్పటి నుంచీ ఒబామా, బిడెన్ లకు అత్యంత సన్నిహితురాలిగా ఉన్న సీమా నందాను బిడెన్ మళ్ళీ అదే కార్మిక శాఖకు సొలిసిటర్ గా ఎంపిక చేశారు.గతంలో ఆమె 12 ఏళ్ళ పాటు సుదీర్ఘంగా లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ అటార్నీగా భాద్యతలు నిర్వహించారు.

ప్రస్తుతం ఆమె పౌర హక్కుల, ఇమ్మిగ్రెంట్ విభాగానికి నేతృత్వం వహిస్తున్నారు.ఆమె నియామకం పట్ల భారతీయ ఎన్నారైలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube