వైరల్ వీడియో: బ్రాండ్ అంబాసిడర్ వివాదంపై దేత్తడి హారిక క్లారిటీ

సోషల్ మీడియాలో షార్ట్ ఫిల్మ్స్ తో యూత్ కు బాగా కనెక్ట్ అయి బిగ్ బాస్ లో చోటు సంపాదించుకుని బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న నటి దేత్తడి హారిక.బిగ్ బాస్ లో తన యాటిట్యూడ్ తో ఒక్కొక్క ఎలిమినేషన్ లో గెలుస్తూ నాలుగో స్థానంలో నిలిచింది.అయితే తాజాగా హారికకు సంబంధించి ఓ వివాదం నడుస్తోంది.తెలంగాణ పర్యాటక శాఖకు బ్రాండ్ అంబాసిడర్ గా దేత్తడి హారికను నియమిస్తూ స్వయంగా టీఎస్ఎండీసీ చైర్మన్ నియామక పత్రాలు అందజేశారు.

 Dettadi Harika Clarity On Brand Ambassador Controversy Dethadi Harika Bigg Boss-TeluguStop.com

అయితే మరుసటి రోజే పర్యాటక శాఖ వెబ్ సైట్ లో ఆమెకు నియామకానికి సంబంధించిన వివరాలు లేకపోవడం, అంతేకాక మంత్రి శ్రీనివాస్ గౌడ్ దేత్తడి హారిక ఎవరో నాకు తెలియదని చెప్పడం, మరల మీడియా సమావేశం ఏర్పాటు చేసి పర్యాటక శాఖ క్లారిటీ ఇవ్వడం లాంటివి జరిగాయి.అయితే తన నియామకానికి సంబంధించి ఇంత పెద్ద వివాదం నడుస్తుండడంతో హారిక ఈ విషయం పై క్లారిటీ ఇచ్చింది.

అయితే నేను తెలంగాణ పర్యాటక శాఖ బ్రాండ్ అంబాసిడర్ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.నా వ్యక్తిగత కారణాల రీత్యా నేను తప్పుకుంటున్నట్లు స్వయంగా వీడియో రూపంలో వెల్లడించింది.

నా జర్నీలో ఇన్నేళ్లుగా నడుస్తున్న వారందరికి కృతజ్ఞతలు తెలిపిన హారిక, మనం ఇంకా ముందుకెళ్దామని, ముందుకెళ్ళాల్సింది చాలా ఉందని హారిక తెలిపింది.ఇక ఈ వివాదంపై హారిక క్లారిటీ ఇవ్వడంతో ఈ వివాదం ఇంతటితో సద్దుమనుగుతుందనుకోవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube