మూడు లక్షలిస్తే బీటెక్ పట్టా మీ సొంతం!

ప్రస్తుతం సమాజంలో చదువుకునేది పోయి చదువు కొనేది వస్తుంది ఎంతోమంది పేద విద్యార్థులకు చదవాలని ఎంతో ఆసక్తి ఉన్న ఆర్థిక స్తోమత తక్కువగా ఉండే సరికి తమ చదువులను మధ్యలోనే ఆపివేస్తున్నారు.వారి గమ్యాన్ని చేరుకోకుండా మధ్యలోనే ఆగిపోతున్నారు.

 Three Lakh Btech Degree Is Yours Three Lakh, B Tech, Hyderabad, Degree ,jntu H,-TeluguStop.com

ఇలా ఎంతోమంది పేద విద్యార్థులు తమ గమ్యాలు చేరుకోకుండా ఉంటే మరికొంతమంది డబ్బున్న విద్యార్థులు డబ్బుతోనే చదువును కొంటున్నారు.ఇలాంటివి ఎన్నో చోట్ల జరుగుతుంటే తాజాగా మరో చోట చదువు అమ్మబడింది.

హైదరాబాద్ నగరంలో ఓ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థి తన చదువును పూర్తి చేయాలేనందున ఏకంగా తన తండ్రే తన బిడ్డ చదువును కొనేసాడు.ఓ రాజకీయ నేతకు చెందిన అటానమస్ కళాశాలను సంప్రదించాడు.

మొత్తానికి బేరం కుదురుగా మూడు లక్షలు ఆ కళాశాలకు అందించాడు.ఇదివరకే ఆ కళాశాలలో చదివిన ఓ విద్యార్థి కొన్ని కారణాలతో మధ్యలో మానేయగా ఆ విద్యార్థి స్థానంలో ఈ విద్యార్థిని చేర్చారు.

మొత్తానికి జె ఎన్ టి యు హెచ్ కు పాసైనట్లు నిర్ధారించారు.

ఇక ఆ విద్యార్థికి వర్సిటీ నుంచి గుర్తింపు రాగా అనుకున్న బీటెక్ పట్టా చేతికి అందింది.

కానీ ఈ విషయం గురించి వర్సిటీ దృష్టి లో పడగా ఆరా తీస్తున్నట్లు తెలిసింది.ఈ అంశంపై పరీక్ష విభాగంలోని ఓ అధికారికి ఈ విషయం గురించి ఈ విషయం గురించి ఫిర్యాదు అందగా ఆయన ఉన్నత అధికారి దృష్టికి తీసుకెళ్లారు.

ఇక ఆయన ఆ విద్యార్ధి హాల్ టికెట్ సంఖ్యతో పాటు వివరాలు సేకరించాలని కోరాడు.దీని వల్ల అన్ని విషయాలు బయట పడతాయని అధికారి తెలిపారు.కానీ మరో అధికారి ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం కళాశాలలో చేరని వారి పేరిట బీటెక్ పట్టాలు పుట్టించడానికి అవకాశం ఉందని తెలుపగా ఇక నుంచి బీటెక్ ప్రవేశాలు పూర్తి కాగానే విద్యార్థుల వివరాలను తెప్పించుకోవాలని నిర్ణయించుకున్నామని తెలిపాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube