సహజంగా 7 నంబర్ ను మామూలుగా 7 లాగే రాస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం.కానీ కొంతకాలం అనంతరం ముందుగా 7 రాసి మధ్యలో గీత గీయడం మొదలు పెట్టేసారు.
వాస్తవానికి ఇలా రాయడాన్ని యూరోపియన్స్ వారు ప్రవేశపెట్టారని అందరూ అంటూ ఉంటారు.ఇలా ప్రవేశపెట్టడానికి కూడా రెండు కారణాలు ఉన్నాయి అన్ని తెలుపుతున్నారు వారు.
అవి ఏంటో మరి తెలుసుకుందామా.
వాస్తవానికి అమెరికా వాళ్ళు 1 రాయాలంటే ఒక నిలువు గీత రాస్తే సరిపోతుంది.
అదే యూరోపియన్ వాళ్లు మాత్రం మనం యూస్ చేసే కీ బోర్డు లోగా 1కి పైన కాస్త యాంగిల్లో ఉండేలా ప్రవేశపెట్టారు.ఈ సందర్భంలో 1,7 తేడా ఉండాలి అని అనుకొని 7 కు అడ్డంగా లైన్ గీయడం మొదలు పెట్టారు.
ఇలా చేయడం కాస్త స్టైల్ గా ఉండడంతో అందరూ దాన్నే ఫాలో అవ్వడం మొదలు పెట్టేశారు.
మరొక కారణం ఏమిటి అంటే.
ఒక యూరోపియన్ టీచర్ నెంబర్స్, యాంగిల్స్ గురించి పిల్లలకు బోధిస్తూ మామూలుగా 7 కు 7 యాంగిల్స్ ను చూపించడం రాకపోవడంతో 7 కు మధ్యలో ఒక లైను గీసి వాటిలో 7 కోణాలు ఉన్న విధంగా చూపించారని సమాచారం.ఇక అప్పటి నుంచి వారు 7 కు అడ్డంగా ఒక లైన్ వేయడం మొదలు పెట్టారట.
ఇది ఇలా ఉండగా మామూలుగా 7 రాసేవారి సైకాలజీ విషయానికి వస్తే.వీరు కాస్త రూల్స్ పాటించడంలో పక్కగా ఉంటారట, రిజల్ట్ ఓరియెంటెడ్ గా పని చేయడంలో ముందువరుసలో ఉంటారని, అంతేకాకుండా విద్యాభ్యాసంలో కూడా కాస్త ముందంజలో ఉంటారని వారు తెలియజేస్తున్నారు.
అదే 7కు అడ్డ గీత గీస్తూ రాసే వారి సైకాలజీ విషయానికి వస్తే.వీరు ప్రత్యేకంగా ఉండాలని ఎప్పుడు అనుకుంటూ ఉండడంతో పాటు.ప్రతి విషయంలో క్లారిటీ మెయింటెన్ చేస్తూ, ఎక్కువగా స్మార్ట్ వర్క్ కి ఇంపార్టెంట్ ఇస్తారట.