నిమ్మ కాయల్లో ఎంతో ఔషధ గుణాలు ఉన్నాయి.విటమిన్-సీ పుష్కలంగా ఉంటుంది.
రోజూ గ్లాసుడు వేడి నీటితో నిమ్మరసం, తేనేను వేసుకుని తాగితే.శరీరంలో నిల్వ ఉన్న వ్యర్థాలను తొలగిస్తుంది.
అయితే నిమ్మకాయలోనే కాదు.నిమ్మ ఆకుల్లోనూ ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
నిమ్మ ఆకులను నురిమి.ఆ వాసనను పీలిస్తే మానసిక ఒత్తిడి తగ్గి ఎంతో ఉత్సాహాన్ని అందిస్తుంది.
గ్లాసు వేడి నీటిలో నాలుగు తాజా నిమ్మ ఆకులను వేసి మూడు గంటల పాటు నానబెట్టాలి.ఆ తర్వాత తాగాలి.అలా చేస్తే నిద్రలేమి సమస్య, గుండె దడ, నరాల బలహీనత వంటి సమస్యలతో బాధ పడుతున్నవారికి త్వరగా ఉపశమనం చేకూరుతుంది.అయితే ఈ నిమ్మ ఆకులను వేడి నీటిలో వేసి మరిగించకూడదని, వేడి చేసిన నీటిని కిందికి దించి నాలుగు నిమ్మ ఆకులను వేసి తాగితే మంచి ప్రయోజనాలు చేకూరుతాయి.
నిమ్మ ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియా గుణాలు అధికంగా ఉంటాయి.వీటితో ఎన్నో బ్యూటీ ప్రొడక్ట్స్ తయారు చేస్తారు.గుప్పెడు నిమ్మ ఆకులను తీసుకుని వేడినీటిలో వేసి ఆ నీటిని రాత్రి నిద్రపోయే ముందు తాగాలి.అలా నెల రోజుల పాటు తాగితే మైగ్రేన్ తలనొప్పి, ఆస్మా వంటి సమస్యలు దరి చేరవు.
నిమ్మ ఆకులను మెత్తగా నూరి దానిలో కొంచెం తేనేను కలపాలి.అలా కలిపిన దాన్ని మొఖానికి ఫేస్ ప్యాక్‌గా వాడితే.టార్క్ స్పాట్స్, మచ్చలు, మొటిమలు తగ్గుతాయి.నోటి దుర్వాసనతో బాధ పడుతున్నవారు.
నిమ్మ ఆకులను ఫేస్ట్‌లా చేసుకుని నీళ్లతో పుక్కలించుకోవాలి.దుర్వాసనతోపాటు దంతాలపై ఉండే వైరస్‌ను కూడా నాశనం చేస్తుంది.
చర్మ సమస్యతో బాధపడేవారు.రోజూ స్నానం చేసేటప్పుడు నీటిలో నిమ్మ ఆకులను వేసుకోవాలి.దీంతో చర్మ సమస్యలు ఉంటే తగ్గుతాయి.దీంతోపాటు నిమ్మ ఆకులను హ్యాండ్ వాష్‌గా కూడా వాడుకోవచ్చు.ఆకులను చేతులపై రాసుకుంటే బ్యాక్టీరియా నశిస్తుందని నిపుణులు చెబుతున్నారు.