సన్నీలియోన్ భర్తకు డ్రైవర్ ఝలక్.. ఏం జరిగిందంటే..?

శృంగార తారగా హిందీ, తెలుగు, ఇతర భాషల్లో పదుల సంఖ్యలో సినిమాల్లో నటించి, ఐటెం సాంగ్స్ చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు సన్నీలియోన్.అయితే సన్నీ భర్త డేనియల్ వెబెర్ కు ముంబైకు చెందిన ఒక డ్రైవర్ ఊహించని స్థాయిలో షాక్ ఇచ్చాడు.

 Man Arrested For Using Sunny Leones Car Number In Mubai, Car Number, Man Arrest-TeluguStop.com

డేనియల్ కారు నంబర్ నే తన కారుకు కూడా వినియోగిస్తూ ముంబైలో ఇష్టానుసారం తిరుగుతున్నాడు.ఆ వ్యక్తి ఇష్టానుసారం కారులో తిరగడం వల్ల పోలీసులు ఆ కారు నంబర్ కు ఎక్కువగా చలాన్లు వేయడంతో ఆ చలానాలను డేనియల్ చెల్లించాల్సి వచ్చింది.

డేనియల్ డ్రైవర్ తమ కారు నంబర్ తో ముంబైలో మరో కారు తిరుగుతుందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. డేనియల్ కారు డ్రైవర్ అక్బర్ ఖాన్ తన యజమాని కారుకు ఏ నంబర్ ఉందో అదే నంబర్ ను గుర్తించి అవాక్కయ్యారు.

ఆ తరువాత సమీపంలో ఉన్న ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇవ్వగా ట్రాఫిక్ పోలీసులు పీయూష్ సేన్ అనే వ్యక్తి కారులో ఉండగా అతనిని అదుపులోకి తీసుకున్నారు.

Telugu Car Number, Piyush, Sunny Leone-Movie

తను వాడుతున్న మెర్సిడెస్ బెంజ్ కారుకు డేనియర్ యొక్క కారు నంబర్ ను పెట్టుకొని నిబంధనలను పాటించకుండా డ్రైవింగ్ చేస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.పోలీసులు పీయూష్ కారు వివరాలను తెలుసుకుని అందులో వివరాలు తప్పుగా ఉండటంతో పీయూష్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.పీయూష్ గతంలో కూడా కొందరు ప్రముఖుల కార్ల నంబర్లను తన కారుకు వినియోగించినట్టు పోలీసుల విచారణలో తేలింది.

సెలబ్రిటీలు ఎక్కువ మొత్తంలో చలాన్లు వచ్చినా వాటిని పెద్దగా పట్టించుకోరని భావించి పీయూష్ ఈ తరహా మోసాలను చేస్తున్నట్టు తెలుస్తోంది.వేర్వేరు సెక్షన్ల కింద, వాహనదారుల చట్టం కింద టాఫిక్ పోలీసులు పీయూష్ పై కేసు నమోదు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube