హిందీలో రీమేక్ అవుతున్న కృష్ణ అండ్ హిజ్ లీల

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ లోకి ఎక్కువ సినిమాలు రీమేక్ అవుతున్నాయి.చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు హిట్ టాక్ తెచ్చుకొని డిఫరెంట్ కథాంశం తో తెరకెక్కిన చాలా సినిమాలు హిందీలోకి వెళ్తున్నాయి.

 Krishna And His Leela Ready To Remake In Bollywood, Siddu Jonnalagadda, Ravikant-TeluguStop.com

అర్జున్ రెడ్డి నుంచి మొదలు పెడితే అల వైకుంఠపురంలో సినిమా వరకు చాలా సినిమాలు హిందీ రీమేక్ తో సందడి చేస్తున్నాయి.హిట్ లాంటి చిన్న సినిమా కూడా హిందీ నిర్మాతలని మెప్పిస్తుంది.

దీంతో తెలుగు సినిమాల మీద బాలీవుడ్ నిర్మాతలు ప్రత్యేక దృష్టి పెట్టి కంటెంట్ బాగుంటే రీమేక్ రైట్స్ సొంతం చేసుకుంటున్నారు.ఇప్పటికి ఒక అరడజను సినిమాలకి పైగా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ లోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నాయి.

రవితేజ క్రాక్ సినిమాని కూడా బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి ప్రముఖ నిర్మాణ సంస్థ రెడీ అవుతుంది.

ఇదిలా ఉంటే గత ఏడాది చిన్న సినిమాగా సురేష్ ప్రొడక్షన్ నుంచి వచ్చి ఒటీటీలో రిలీజ్ అయిన మూవీ కృష్ణ అండ్ హిజ్ లీల.

ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ, శ్రద్ధా శ్రీనాథ్, షాలిని, షీరత్ కపూర్ హీరో, హీరోయిన్లుగా నటించారు.యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని రవికాంత్ పేరెపు తెరకెక్కించారు.

ఇక ఈ సినిమా నిర్మాణంలో బాలీవుడ్ నిర్మాణ సంస్థ వ్యాకమ్ 18 మోషన్ పిక్చర్స్ కూడా భాగం అయ్యింది.ఇప్పుడు ఇదే నిర్మాణం సంస్థ కృష్ణ అండ్ హిజ్ లీల మూవీని హిందీలో రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.

ఒరిజినల్ ను తెరకెక్కించిన రవికాంత్ పేరెపునే ఈ రీమేక్ ను తెరకెక్కించనున్నట్టు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube