గోపీచంద్ కోసం తెలుగు బ్యూటీని దింపుతున్న మారుతి

టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో తెలుగు హీరోయిన్స్ కి భాగానే అవకాశాలు వస్తున్నాయి.దర్శకుల టేస్ట్ కూడా మారడంతో కేవలం సినిమాలలో హీరోయిన్స్ అంగాంగ ప్రదర్శన చేసేవాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వకుండా గ్లామర్ గా కనిపిస్తూ, స్క్రీన్ బ్యూటీనెస్ తీసుకొచ్చే హీరోయిన్స్ కి ప్రాధాన్యత ఇస్తున్నారు.

 Eesha Rebba Romance With Gopichand, Tollywood, Telugu Cinema, South Cinema, Pakk-TeluguStop.com

ఈ నేపధ్యంలో గత కొంత కాలంలో టాలీవుడ్ లో నార్త్ భామలకంటే సౌత్ లోనే కన్నడ, మల్లు భామలకి మంచి అవకాశాలు వస్తున్నాయి.కన్నడ నాట నుంచి వచ్చిన పూజాహెగ్డే, రష్మిక మందన ప్రస్తుతం టాప్ రేస్ లో ఉండగా, ఉప్పెన సినిమాతో కృతి శెట్టి కూడా ఇప్పుడు క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.

అలాగే మలయాళీ భామలైన కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్, ప్రియాంక అరుల్ మోహన్ లాంటి భామలకి మంచి క్రేజ్ ఉంది.ఇదే విధంగా తెలుగు భామలైన రితూ వర్మ,ఈషారెబ్బ, ఐశ్వర్య రాజేష్, ఆనంది లాంటి భామలకి కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి.

Telugu Maruti, Eesha Rebba, Gopichand, Pakka, Rashi Khanna, Telugu, Tollywood-Mo

ఇప్పటికే ఈషారెబ్బ కన్నడంలోకి ఎంట్రీ శివరాజ్ కుమార్ కి జోడీగా భారీ బడ్జెట్ మూవీలో నటిస్తుంది.మరో వైపు గుణశేఖర్ శాకుంతలంలో ఓ కీలక పాత్రలో నటించే అవకాశం ఈషాకి వచ్చింది.ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ ని ఈ భామ సొంతం చేసుకుంది.మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కనున్న పక్కా కమర్షియల్ సినిమాలో రాశీఖన్నాతో పాటు ఈషా రెబ్బని హీరోయిన్ గా ఖరారు చేసినట్లు తెలుస్తుంది.

ఈషారెబ్బకి మొదటి నుంచి మారుతి మంచి అవకాశాలు ఇస్తున్నాడు.అతని నిర్మాణంలో తెరకెక్కే సినిమాలలో అవకాశం ఇచ్చాడు.ఇప్పుడు తన దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో ఒక హీరోయిన్ గా ఈషాకి అవకాశం ఇచ్చాడు.త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube