Dasari Narayana Rao : దాసరి ఎవరి దగ్గర నుంచి ఒసేయ్ రాములమ్మ స్క్రిప్ట్ చెప్పకుండా తీసుకున్నారు ?

ధవళ సత్యం(Director Dhavala Satyam).సమాజం యొక్క మార్పు కోరుకొని విప్లవాత్మక సినిమాలను తీయడం లో ఆయనది అంద వేసిన చెయ్యి.

 How Dasari Theftosey Ramulamma Script From His Assistant-TeluguStop.com

చాల మంది లాగ అయన కూడా దాసరి నారాయణ రావు(Dasari Narayana Rao) దగ్గరే పని చేసారు.కానీ మిగతా వారికి ఈయనకు చాల తేడా ఉంటుంది.

తీసే సినిమాలు, చూపించే విధానం అంత కూడా చాల భిన్నంగా ఉంటుంది.అయితే సినిమా ఒత్సాహికులు పుట్టిన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం(West Godavari District) లో సత్యం జన్మించారు.

ఈయన సినీ ప్రయాణం ప్రజా నాట్య మండలి నుంచి మొదలయ్యింది.తనవంతుగా భావి భారత నిర్మాణం కోసం సినిమాలు తీయాలని ఆయనకు ఎప్పుడు ఉండేది.

అందుకే దాసరి దగ్గర మొదట శిష్యరికం చేసారు.

Telugu Dasari Yana Rao, Dhavala Sathyam, Dhavala Satyam, Nandi Award, Osey Ramul

శివరంజని, మహమ్మద్ బీన్ తుగ్లక్, రంగూన్ రౌడీ వంటి సినిమాలకు అసిస్టెంట్ గా పని చేసి పి ఎల్ నారాయణతో సుబ్బారావు కి కోపం వచ్చింది అనే ఒక సినిమా తీశారు మొదట.ఈ చిత్రం తర్వాత మాదాల రంగారావు తో, ఆర్ నారాయణ మూర్తి తో కొన్ని సినిమాలు తీసాడు.అయన తీసిన యువతరం కదిలింది చిత్రానికి కాను నంది అవార్డు(Nandi Award) కూడా లభించింది.

ఇక చిరంజీవితో జాతర అనే ఒక చిత్రాన్ని కూడా తీసిన సత్యం ఎర్ర మల్లెల్లు, గుడి గంటలు మ్రోగాయి సినిమాలు తీశారు.అయన తీసిన నేను సైతం మూవీ జనాల్లో మంచి ఆదరణ పొందింది.

Telugu Dasari Yana Rao, Dhavala Sathyam, Dhavala Satyam, Nandi Award, Osey Ramul

అయితే ధవళ సత్యం గిరిజన తండాకు చెందిన ఒక మహిళకు జరిగిన అన్యాయాలపై శారదా ను(Sarada) హీరోయిన్ గా తీసుకొని మన్యంలో మంగ అనే ఒక సినిమాను ప్రారంభించారు.కానీ ఆర్థిక కారణాల చేత ఈ సినిమా మొదలెట్టిన పదిహేను రోజులకే ఆగిపోయింది.ఈ సినిమాలో నటించిన శారద ద్వారా కథ తెలుసుకున్న దాసరి ఆ కథ ఆయనకు బాగా నచ్చడం తో డెవలప్ చేయిచి విజయ శాంతి తో ఒసేయ్ రాములమ్మ( osey ramulamma,Vijaya Shanti) అనే సినిమా తీశారు.షూటింగ్ పూర్తి చేసి మరో మూడు రోజుల్లో విడుదల ఉండగా సత్యం కి ప్రివ్యూ చూపించారు.

ఏంట్రా ఎలా వుంది సినిమా అంటూ దాసరి ప్రశ్నించగా గట్టిగా హత్తుకొని చాల బాగుంది.కానీ కథ అడిగితే నేనే ఇచ్చే వాడిని కదా అని అన్నాడట.

అందుకేరా నీకు చూపించింది అంటూ దాసరి వెళ్లిపోయారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube