వైయస్ వివేకానంద రెడ్డి( YS Vivekananda Reddy ) హత్య కేసు ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది.ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి జైలుకు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు సొంత పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు.
ఇక ఈ కేసుకు సంబంధించి విచారణ ఈ నెల 30 కి కంప్లీట్ చేయాలని ప్రారంభంలో సుప్రీంకోర్టు తెలియజేయగా కొద్ది రోజుల క్రితం జూన్ 30వ తారీకు వరకు… పొడిగించడం జరిగింది.పరిస్థితి ఇలా ఉంటే వివేక హత్య కేసు విచారణలో సీబీఐ మరింత దూకుడు పెంచడం జరిగింది.
ఈ కేసులో తాజాగా మరో ఇద్దరినీ విచారించడం జరిగింది.పూర్తి వివరాలలోకి వెళ్తే వైయస్ వివేకానంద రెడ్డి కంప్యూటర్ ఆపరేటర్ ఇనయతుల్లా ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డి ( Uday Kumar Reddy )తండ్రి ప్రకాష్ రెడ్డిని ఈరోజు ఉదయం హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో విచారించారు.
వారి స్టేట్మెంట్లను రికార్డు చేయడం జరిగింది.హత్య జరిగిన రోజు వివేక మృతదేహాన్ని బాత్రూం నుండి ఇనయతుల్లానే బయటకు తీసుకురావడం జరిగింది.ఈ హత్య కేసులో ప్రత్యక్ష సాక్షిగా గతంలో ఇనయతుల్లానీ పులివెందులలో సీబీఐ అధికారులు ఓసారి విచారించడం జరిగింది.







