తెలంగాణలో కొత్త కరోనా కేసులు ఎన్నంటే.. ?

తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు మాత్రం మెల్లగా నమోదు అవుతున్నాయి.ఇప్పటికే వ్యాక్సినేషన్ పక్రియ మొదలైనప్పటికి కొందరిలో వ్యాక్సిన్ వేసుకుంటే ఏదైనా జరుగుతుందో అనే భయంలో ఉంటున్నారు.

 Telangana Corona Update, Telangana, Covid19, Corona Update, New Cases-TeluguStop.com

ఇకపోతే తెలంగాణలో నిన్న రాత్రి 8 గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్దారణ పరీక్షల్లో కొత్తగా 163 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ వెల్లడించింది.

దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,94,469కి చేరింది.

ఇకపోతే నిన్న కరోనాతో ఒకరు మృతి చెందగా ఇప్పటి వరకు మృతుల సంఖ్య 1,599 కి చేరింది.కరోనా బారి నుంచి నిన్న 276 మంది కోలుకున్నారు.

ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,90,630 కి చేరింది.రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 2,240 ఉండగా వీరిలో 828 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.

జీహెచ్‌ఎంసీలో కొత్తగా 28 కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube