1.ఉద్యోగుల కోసం ప్రత్యేక యాప్
ఉద్యోగులు తమ జీతభత్యాల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక యాప్ ను రూపొందించింది.ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టం ( ఐ ఎఫ్ ఎం ఎస్ ) పేరిట ఇది ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది.
2.ఆవుని చంపిన పులి
ఏపీ లోని పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు మండలం లచ్చి గూడెం అడవిలో పులి సంచారం కలకలం రేపుతోంది.నిన్న రాత్రి లచ్చగూడెం గ్రామానికి చెందిన సున్నం వెంకయ్య అనే వ్యక్తి కి చెందిన పులిని ఆవు హత మార్చింది.
3.బ్రిటన్ కు విమానాల బంద్
బ్రిటన్ లో కొత్త కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి 7 వరకు బ్రిటన్ కు విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్లు భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.
4.మే నెల లో పదో తరగతి పరీక్షలు
ఏపీలో పదో తరగతి పరీక్షలు మే నెలలో నిర్వహించాలనే అలోచనలో విద్యా శాఖ ఉంది.ఏప్రియల్ 30 వరకు స్కూళ్లు నిర్వహిస్తామని రాష్ట్ర విద్యా, పరిశోధన , శిక్షణ మండలి డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు.
5.లాక్ డౌన్ ఆంక్షల పొడిగింపు
దేశంలో కొత్త కరోనా వైరస్ కేసులు పెరిగిపోతుండడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు రాష్ట్రంలో మరో నెల రోజుల పాటు లాక్ డౌన్ నిబంధనలు పొడిగించింది.జనవరి 31 వరకు లోన్ నిబంధనలు అమలులో ఉంటాయని ఆదేశాలు జారీ చేసింది.
6.అమ్మకానికి 3 వేల బాంబులు
సౌధికి 3 వేల స్మార్ట్ బాంబులు అమ్మకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు.వీటి విలువ 290 మిలియన్ డాలర్లు.
7.టీవీ లైవ్ లో టీకా తీసుకున్న కమలా హారీస్
అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్ కరోనా టీకాను తీసుకున్నారు.ఈ తతంగం అంతా టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేశారు.
8.అలియా భట్ రణ్ బీర్ కపూర్ నిశ్చితార్థం
బాలీవుడ్ స్టార్స్ సెలబ్రిటీలు రణ్ బీర్ కపూర్ – అలియాభట్ నిశ్చితార్థం ఈరోజు రాజస్థాన్ లోని రత్నం బోర్ లో జరగబోతున్న ట్లు తెలుస్తోంది.
9.బిజెపిలో చేరిన భారత మాజీ క్రికెటర్
భారత మాజీ క్రికెటర్ తమిళనాడు వాసి లక్ష్మణ్ శివరామకృష్ణన్ నేడు బిజెపిలో చేరారు.
10.సింగపూర్ లో కోవిడ్ వ్యాక్సిన్
సింగపూర్ లో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది.ఆసియాలో ఫైజర్ టీకాతో వ్యాక్సినేషన్ మొదలు పెట్టిన తొలి దేశాల్లో సింగపూర్ ఒకటి కాగా, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఇదే మొదటిది.
11.ఏపీలో కరోనా
గడచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా కొత్తగా 326 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
12.ఆలయాలపై దాడులు .పవన్ కామెంట్స్
విజయనగరం జిల్లా రామతీర్థం లోని బౌద్ధ క్షేత్రం లోని బోధికొండపై ఉన్న కోదండరాముడి విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.ఈ ఘటనకు వెంటనే ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
13.పోలీస్ శాఖ ల్లో భారీగా ఖాళీలు
దేశంలో వివిధ రాష్ట్రాల్లో పోలీస్ శాఖల్లో 5.31 లక్షల ఖాళీ లు ఉన్నట్టు కేంద్ర హోం శాఖ ప్రకటించింది.
14.ఏసీబీ లో ఆరు కొత్త పోస్టులు
తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ ( ఏసీబీ) లో ఆరు కొత్త పోస్టుల ఏర్పాటుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది.
15.సచివాలయం పై వలంటీర్ల దాడి
చిత్తూరు జిల్లాలోని వీకే ఆర్ పురం సచివాలయం పై వలంటీర్లు దాడికి పాల్పడ్డారు.సచివాలయంలోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు.విధులకు సక్రమంగా హాజరు కాకపోవడంతో పై అధికారులు వారికి ఆబ్సెంట్ వేయడమే ఈ దాడికి కారణంగా తెలుస్తోంది.
16.ఎయిర్ హోస్టెస్ గా సౌదీ మహిళలకు అవకాశం
మహిళా స్వాలంబనపై దృష్టి పెట్టిన సౌదీ ప్రభుత్వం ఇక విమానయాన రంగంలోనూ మహిళలకు ప్రాధాన్యం ఇస్తోంది.సౌదీ ఎయిర్ లైన్స్ లో 50 మంది మహిళ లకు ఎయిర్ హోస్టెస్ గా నియమించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.
17.కొత్త ఏడాదిలోనే పిసిసి అధ్యక్షుడు ఎంపిక
కొత్త ఏడాదిలోనే పిసిసి అధ్యక్షుడి ఎంపిక చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి మాణిక్యం ఠాకూర్ ప్రకటించారు.
18.నీళ్లు జల్లాకే రోడ్లు ఉడ్చాలి
పట్టణ ప్రాంతాల్లో రహదారులను ఇచ్చేముందు వాటిపై నీళ్లు అని ఆ తర్వాతే రోడ్లను ఊడ్చాలి అని తెలంగాణ మున్సిపల్ శాఖ తమ సిబ్బందిని ఆదేశించింది.నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపడుతున్నారు.
19.మంత్రి కారుకు అడ్డం పడిన రైతు
తన భూ సమస్యను పరిష్కరించాలంటూ ఓ రైతు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కారుకు అడ్డం పడి ఆందోళన నిర్వహించాడు.ఈ ఘటన వనపర్తి జిల్లా గోపాల్ పేట లో జరిగింది.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46700
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 50,950
.