తెలుగు సినిమా పరిధిని చాలా పెంచారు రాజమౌళి.ఆయన దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాతో టాలీవుడ్ గురించి అంతర్జాతీయ స్థాయిలో మాట్లాడుకునేలా చేశారు అనడంలో సందేహం లేదు.
బాహుబలి సినిమా తర్వాత టాలీవుడ్ లో పెట్టుబడులు పెట్టేందుకు హాలీవుడ్ నిర్మాణ సంస్థలు కూడా వచ్చాయి అనడంలో సందేహం లేదు.అంతటి అద్బుతమైన పేరును దక్కించుకన్న టాలీవుడ్ లో ప్రముఖ ఓటీటీ జీ5 వారు పేరు నిలుపుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇన్నాళ్లు ఉత్తరాది బిజినెస్ పై మాత్రమే ఫోకస్ పెట్టిన జీ5 వారు అనూహ్యంగా తెలుగు సినిమాలను వరుసగా కొనుగోలు చేసేందుకు సిద్దం అవుతున్నారు.ఇటీవలే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన సోలో బ్రతుకే సోబెటర్ సినిమాను భారీ మొత్తానికి కొనుగోలు చేశారు.
ఓటీటీ రైట్స్ మాత్రమే కాకుండా థియేట్రికల్ రైట్స్ ను కూడా కొనుగోలు చేయడం జరిగింది.
సోలో బ్రతుకే సోబెటర్ సినిమాను హోల్ సేల్ గా కొనుగోలు చేసిన జీ 5 వారు థియేట్రికల్ రిలీజ్ కు సిద్దం అయ్యారు.
దాంతో ప్రస్తుతం అందరు కూడా ఈ సమయంలో థియేట్రికల్ రిలీజ్ ఎలా అంటూ వారిపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమాతో పాటు ఇటీవలే నితిన్ హీరోగ కీర్తి సురేష్ హీరోయిన్ గా రూపొందుతున్న రంగ్ దే సినిమాను కూడా కొనుగోలు చేసింది.
ఆ సినిమాకు ఏకంగా 40 కోట్లను పెట్టి కొనుగోలు చేయడం జరిగింది అంటున్నారు.ఇక తాజాగా మరో సినిమాను కూడా జీ5 వారు కొనుగోలు చేశారు.అదే నాని నటించబోతున్న అంటే సుందరానికి.సినిమాను ఏకంగా 50 కోట్లు పెట్టి జీ5 వారు కొనుగోలు చేశారు.
ఈమద్య కాలంలోనే టాలీవుడ్ లో వంద కోట్ల వరకు పెట్టేందుకు సిద్దం అయ్యింది.టాలీవుడ్ లో డిస్ట్రీబ్యూషన్ మరియు ఓటీటీ రంగంలో జెండా పాతేందుకు వందల కోట్లను జీ5 సంస్థ పెడుతోంది.
దాంతో ఇతర నిర్మాతలు మరియు ఓటీటీ వారు జీ 5 వెనుక నిలుస్తున్నారు.