యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్న రామ్ సాంగ్!

తెలుగు నటుడు రామ్ పోతినేని గురించి అందరికీ తెలిసిందే.తను నటించే సినిమాల్లో తన పాత్ర ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.తమిళం భాషల్లో కూడా నటించిన రామ్ తెలుగు లో ఎన్నో సినిమాలలో తన నటనతో మంచి పేరు సంపాదించుకున్నారు.2006 దేవదాసు సినిమాతో తెలుగు ప్రేక్షకుల కు పరిచయమైన రామ్ ఆ సినిమా నుండే పక్కా మాస్ లుక్ తో అందరినీ అలరించారు.ఎన్నో సినిమాలలో నటించి 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ లో కూడా తన పాత్రను మాస్ గా చూపించాడు.

 Kaun Acha Kaun Lucha Song, Red Film, Hero Ram, Manisharma, Kaun Acha Kaun Lucha-TeluguStop.com

ఈ సినిమాతో మరింత క్రేజీ పెంచుకున్నా రామ్ ప్రస్తుతం తిరుమల కిషోర్ దర్శకత్వంలో నివేదా పేతురాజ్, మాళవిక శర్మ, అమృత అయ్యర్ కాంబినేషన్ లో వస్తున్నా ‘రెడ్’ చిత్రం లో రామ్ హీరోగా నటిస్తున్నారు.

కాగా ఈ సినిమా లో విడుదల చేస్తున్న పాట లల్లో “కౌన్ హే అచ్చా.కౌన్ హే లుచ్చా.” అనే పాటకు ఎక్కువ ఫాలోయింగ్ కనిపిస్తుంది.కళ్యాణ్ చక్రవర్తి లిరిక్స్ లో వచ్చిన ఈ పాట కు పూరి జగన్నాథ్ ట్విట్టర్ లో ఈ పాట గురించి తెలపగా తిరుమల కిషోర్ సంతోషాన్ని వ్యక్తపరిచారు.

సింగర్ అనురాగ్ కుల్ కర్ని, సంగీత డైరెక్టర్ మణిశర్మ కాంబినేషన్ లో వస్తున్న పాట అద్భుతంగా మ్యాచ్ అయిందని తెలిపారు.కాగా ఈ పాట ను విడుదల చేసిన కొంత సమయంలోనే యూట్యూబ్ లో విపరీతమైన లైక్ లు, షేర్లు, కామెంట్లు వచ్చాయి.ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో ట్రెండ్ కాగా మణిశర్మ సంగీతానికి అంతు లేదని సోషల్ మీడియా లో కామెంట్లను చేస్తున్నారు.కాగా ఈ సినిమా జనవరి 2021న విడుదల అవుతుందని రెడ్ టీమ్ తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube