విజయ్ దేవరకొండ పూరి జగన్నాద్ల కాంబినేషన్లో రూపొందుతున్న ఫైటర్ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుంది.మార్చిలో కరోనా వల్ల ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ ఇప్పటి వరకు పునః ప్రారంభం కాలేదు.
ముంబయిలో ఆగిపోయిన చిత్రీకరణ మళ్లీ అక్కడే ప్రారంభించాలని భావిస్తున్నారు.దర్శకుడు పూరి మరియు విజయ్ కాని షూటింగ్ విషయంలో ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు.
సినిమా షూటింగ్ లకు అనుమతులు వచ్చిన నేపథ్యంలో వరుసగా సినిమాలు షూటింగ్ ప్రారంభం అవుతున్నాయి.కాని ఫైటర్ సినిమా విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి అప్డేట్ రాలేదు.
వరుసగా సినిమాలు చేస్తున్న హీరోలు ఇప్పటికే షూటింగ్ ప్రారంభించారు.
కాని విజయ్ దేవరకొండ మాత్రం ఇప్పటి వరకు షూటింగ్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోక పోవడం పట్ల ఆయన అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నాడు.గత నెల రెండు నెలలుగా యంగ్ హీరోలు అంతా కూడా సెట్స్ పైకి వెళ్లారు.కాని ఈయన మాత్రం ఎందుకు ఇంకా దూరంగా ఉంటున్నాడు అంటున్నారు.అయితే విజయ్ దేవరకొండది ఆలస్యం కాదని.
సినిమా షూటింగ్ కు టైం కలిసి రావడం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
ఈ సినిమాలో హీరోయిన్గా అనన్య పాండే నటిస్తున్న విషయం తెల్సిందే.ఆమె ఇతర సినిమాలకు డేట్లు ఇవ్వడం వల్ల ఇప్పుడు ఆమె ఫైటర్ కు డేట్లు ఇచ్చే పరిస్థితి లేదట.ఆమె లేకుండా ముంబయి షెడ్యూల్ ను పూర్తి చేయడం సాధ్యం కావడం లేదు.
ఈ విషయం లో పూరి మరియు విజయ్ దేవరకొండలు పలు దఫాలుగా చర్చలు జరిపినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే నెలలో షూటింగ్ ను పునః ప్రారంభించే అవకాశం ఉంది అంటున్నారు.