బాగా పనిచేసి అలసిపోయి ఇంటికి వచ్చాక ప్రశాంతంగా వేడి నీటితో స్నానం చేసి అలా కూర్చున్నాము అంటే మనకు తెలియకుండానే ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంటారు ఎంతోమంది.ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 35 శాతం పైగా ప్రజలు అధిక బరువుతో బాధపడుతున్నట్లు పరిశోధనలు తెలిపాయి.
ఇందులో అధిక బరువు ఉండడానికి గల కారణం వారి వారి ఆహార అలవాట్లు లేదా పని చేసే విధానం.
అయితే ఇలా వారి ఊబకాయాన్ని తగ్గించుకోవడంతో కోసం ప్రజలు వింతవింత ప్రయత్నాలు చేస్తూ.
కొంతమంది విజయం సాధిస్తే కొంతమంది మాత్రం మరింతగా బరువును పెంచుకుంటారు.ఇందుకోసం చాలా మంది జిమ్ బాటపడితే మరికొందరు డైట్ అంటూ వివిధ కోర్సులు మొదలుపెడతారు.
ఇక మరికొందరైతే యోగా బాట పడతారు.
ఇకపోతే తాజాగా ఇలాంటి కష్టాలు అని పడకుండా కేవలం స్నానం చేయడం ద్వారా కూడా బరువు తగ్గవచ్చని ఇంగ్లాండ్ దేశానికి చెందిన బ్రిటన్ యూనివర్సిటీకి చెందిన రీసెర్చ్ ఓ విషయాన్ని తెలిపారు.
అదేమిటంటే సదరు వ్యక్తి రీసెర్చ్ లో 104 డిగ్రీల సెల్సియస్ ఉన్న వేడినీళ్లతో సుమారు గంట పైన స్నానం చేస్తే… వారి బాడీలో నుంచి ఏకంగా 130 క్యాలరీలను కరిగించుకోవచ్చు అని తెలిపారు.ఈ విధంగా వారానికి రెండు లేదా మూడు సార్లు వేడి నీటి స్నానం చేస్తే మనిషి దాదాపు అర కిలో వరకు బరువు తగ్గవచ్చని తెలిపారు.
ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో పని ఒత్తిడి వల్ల లేదా ఎక్కువగా తినడం లేదా, వారి ఆహార నియమాల్లో మార్పు లేకపోవడంతో చాలామంది ఊబకాయం పొందాల్సి వస్తుంది.