దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో చాప కింద నీరులా కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది.ఈ రంగం, ఆ రంగం అనే తేడా లేకుండా అన్ని రంగాలపై వైరస్ ప్రభావం పడింది.
ప్రైవేట్ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు, వ్యాపారులు వైరస్ వ్యాప్తి వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు.వైరస్ గురించి, వ్యాక్సిన్ గురించి శాస్త్రవేత్తల పరిశోధనలు కొనసాగుతున్నాయి.
ఈ పరిశోధనల్లో ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
తాజాగా శాస్త్రవేత్తలు స్టెరాయిడ్లు కరోనా నుంచి రక్షించడంలో సహాయపడతాయని చెప్పారు.
కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రోగులకు స్టెరాయిడ్లు ఇవ్వాలని సూచిస్తున్నారు.రెండు నెలల క్రితం ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో డెక్సామెతాసోన్ స్టెరాయిడ్ ను తీసుకున్న రోగులలో 1/8 వ వంతు రోగులకు వెంటిలేటర్ తో చికిత్స అవసరం లేకుండా పోయింది.
తాజాగా శాస్త్రవేత్తలు హైడ్రోకోర్టిసోన్ అనే మరో స్టెరాయిడ్ కూడా కరోనా రోగులపై ప్రభావం చూపుతుందని తెలిపారు.
తీవ్ర అనారోగ్యానికి గురైన రోగులలో 20 శాతం మందిపై స్టెరాయిడ్లు ప్రభావం చూపి మరణం ముప్పును తగ్గించగలవని తేల్చారు.1703 మంది రోగులపై ఏడు ట్రయల్స్ నిర్వహించి ఈ విషయాలను వెల్లడించారు.అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్ ట్రయల్స్ కు సంబంధించిన ఫలితాలు ప్రచురితమయ్యాయి.
బ్రిస్టల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జొనాథన్ స్టెర్న్ స్టెరాయిడ్లు తక్కువ ధరకే లభించడంతో పాటు మెడికేషన్ కోసం ఉపయోగపడతాయని చెప్పారు.
స్టెరాయిడ్ల వల్ల వైరస్ లపై పోరాడేందుకు తమకు ఆయుధాలు దొరికినట్లేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ స్టెరాయిడ్ల సహాయంతో వ్యాక్సిన్ తయారీ దిశగా అడుగులు వేస్తున్నట్టు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.