ఈ మధ్య కాలంలో రాజకీయ ప్రచారాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.చివరకు తినే ఆహారాలను సైతం పబ్లిసిటీ కోసం వినియోగించుకునే రాజకీయ పార్టీల సంఖ్య పెరుగుతోంది.
మరికొన్ని నెలల్లో తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అక్కడి బీజేపీ శ్రేణులు సరికొత్తగా రాజకీయ ప్రచారం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.ఇందుకోసం ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ పేరును వినియోగించుకుంటున్నాయి.
తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లాలో మోదీ ఇడ్లీల పేరుతో పది రూపాయలకు నాలుగు ఇడ్లీలు అమ్ముతూ బీజేపీ శ్రేణులు సరికొత్త ప్రచారానికి తెర తీశారు. బీజేపీ పార్టీ నేత మహేష్ ఆ ప్రాంతంలో మోదీ ఇడ్లీలను అమ్మే విధంగా చర్యలు చేపట్టారు.
సేలం జిల్లాతో పాటు తమిళనాడు రాష్ట్రమంతా మోదీ హవా కొనసాగాలనే ఉద్దేశంతో ఈ తరహా ప్రచారం శ్రీకారం చుట్టామని మహేష్ మీడియాకు తెలిపారు.
మోదీ ఇడ్లీలు అని రాసిన పోస్టర్లను హోటళ్ల దగ్గర ఉంచి 22 చిన్న, మధ్య స్థాయి హోటళ్ల ద్వారా ఇడ్లీల విక్రయాలు జరిగేలా బీజేపీ నేతలు చర్యలు చేపట్టారు.
దీంతో మోదీ ఇడ్లీలకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ సరికొత్త రాజకీయ ప్రచారం కొంతవరకు బీజేపీకి లబ్ధి చేకూరుస్తుందనే చెప్పాలి.
కొందరు ఇతర ప్రాంతాల నుంచి సేలంకు వెళ్లి మోదీ ఇడ్లీలను కొనుగోలు చేస్తుండటం గమనార్హం.
ఇప్పటికే తమిళనాడు వ్యాప్తంగా మోదీ ఇడ్లీలు పాపులర్ కాగా భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినా ఈ తరహా ప్రచారం కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి.