మాస్కు లేకుంటే.. మూడు మార్గాల నుంచి కరోనా!

కరోనా వైరస్.చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పటికే 2 కోట్ల 32 లక్షలమందికి వ్యాపించి ఎంతోమందిని అనారోగ్యానికి గురి చేస్తుంది.

 With Out Face Mask Coronavirus Comes In Three Ways 3 New Scientific Studies, Mas-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే కరోనా సోకకుండా ఉండాలంటే ఇంట్లోనే ఉండాలని, బయటకు వచ్చినా మాస్కు ధరించాలని, శానిటైజర్ ఉపయోగించాలని ఎంతమంది హెచ్చరిస్తున్న కొందరు శానిటైజర్ ఉపయోగించడం లేదు, మాస్క్ ధరించడం లేదు.

ఈ నేపథ్యంలోనే మాస్కు ధరించకపోతే కరోనా వైరస్ తెలియని మార్గాల్లో సోకుతుందని నిపుణులు చెప్తున్నారు.

కరోనా వైరస్ మూడు కొత్త మార్గాల్లో వ్యాపిస్తుంది వారు తెలిపారు.అవి తక్కువ తేమ, పబ్లిక్ రెస్ట్ రూంలు, గాలిలో దుమ్ము ద్వారా వ్యాపిస్తుంది పరిశోధనల్లో తెలిసింది.

గాల్లో తేమ తక్కువ ఉంటే వైరస్ వేగంగా వ్యాపిస్తుందని, దీనికి కారణం వైరస్ గాలి ద్వారా ఇతరులకు వ్యాపిస్తుందని గుర్తించారు.

పబ్లిక్ రెస్ట్రూమ్ టాయిలెట్ లేదా మూత్రాన్ని ప్లస్ చేయడం వల్ల వైరస్ నిండిన ఏరోసోల్స్ బయటకు వస్తాయని మరుగుదొడ్లు, మూత్ర విసర్జన చేసినప్పుడు కరోనా వైరస్ కణాలు అధికంగా విడుదల అవుతాయని శాస్త్రవేత్తలు ట్రాక్ చేశారు.

దీని ద్వారా వైరస్ సోకే ప్రమాదం ఎక్కువ ఉందని తెలిపారు.

కాగా గాలిలో దుమ్ము ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తోందని పరిశోధకులు చెప్తున్నారు.గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుంది ఇప్పటికే ఓ అధ్యయనంలో తేలగా ఇప్పుడు దుమ్ములో ఉంటుందని అదే వ్యాపించేలా చేస్తుందని తేల్చేశాయి.అందుకే మాస్కు తప్పనిసరిగా ధరించాలని లేదంటే ఈ మూడు మార్గాల ద్వారా వ్యాపించే అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube