పుష్ప తర్వాత సెట్స్ పైకి ఐకాన్ మూవీ... త్వరలో అఫీషియల్ ఎనౌన్స్

దిల్ రాజు ప్రొడక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో గత ఏడాది ఐకాన్ అనే మూవీ ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.ఇక అప్పుడే సినిమాకి సంబందించిన టైటిల్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు.

 Allu Arjun Icon Movie Will Be Going On Sets 2022, Tollywood, Dill Raju, Venu Sri-TeluguStop.com

అయితే అల్లు అర్జున్ ఆ సినిమాని పక్కన పెట్టి త్రివిక్రమ్ తో అల వైకుంఠపురంలో పూర్తి చేసి సూపర్ హిట్ కొట్టాడు.మళ్ళీ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

ఈ సినిమా ఇప్పటికే సెట్స్ పైకి వెళ్ళాల్సి ఉన్న కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడిపోయింది.ఇక దిల్ రాజు కూడా ఆ సినిమాని హోల్డ్ లో పెట్టి పవన్ కళ్యాణ్ తో పింక్ రీమేక్ గా వకీల్ సాబ్ సినిమాని వేణు శ్రీరామ్ దర్శకత్వంలో సెట్స్ పైకి తీసుకొని వెళ్ళాడు.

ఈ సినిమా షూటింగ్ చివరి దశకి వచ్చే సమయంలో కరోనా కారణంగా వాయిదా పడిపోయింది.ప్రస్తుతం వకీల్ సాబ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేస్తున్నారు.

ఈ సినిమాకి సంబందించిన ఒక నెల రోజుల షెడ్యూల్ ఉంది.

ఇదిలా ఉంటే బన్నీతో చేయాల్సిన ఐకాన్ సినిమా కథని దిల్ రాజు పూర్తిగా పక్కన పెట్టేసారని ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం లేదని ప్రచారం జరిగింది.

సినిమా స్క్రిప్ట్ అనుకున్న స్థాయిలో రాకపోవడంతోనే వదిలేసినట్లు టాక్ వినిపించింది.అయితే ఈ వార్తలలో వాస్తవం లేదని దిల్ రాజు టీం నుంచి వినిపిస్తున్న మాట.ఐకాన్ మూవీ అద్భుతమైన సబ్జెక్ట్ అని అది కచ్చితంగా సెట్స్ పైకి వెళ్తుందని చెబుతున్నారు.పుష్ప సినిమా తర్వాత ఐకాన్ సినిమాపై అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ చేయడంతో పాటు, సినిమా ప్రారంభోత్సవం కూడా జరుగుతుందని బలంగా అంటున్నారు.

అల్లు అర్జున్ డేట్స్ చూసుకొని సినిమా స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube