ఇవి కరెక్ట్ గా ఉంటేనే పీఎఫ్ విత్‌ డ్రా సాధ్యమయ్యేపని...! లేకపోతే...?

ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ ఏ విధంగా ఇబ్బంది పడుతున్న ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రోజురోజుకి దేశ వ్యాప్తంగా కరోనా కేసులు అమాంతం పెరుగుతున్నాయే తప్పించి ఎక్కడా తగ్గట్లేదు.

 Pf Amouunt Claim Process Online,provident Fund, Employee, Uan, Aadhar Number, Ph-TeluguStop.com

అయితే ఈ కరోనా నేపథ్యంలో భాగంగా కరోనా వైరస్ వల్ల ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.ఈ నేపథ్యంలో ప్రతి ఉద్యోగి తన జీవితంలోని కొంత మొత్తాన్ని ఆర్థిక అవసరాల కొరకు ప్రావిడెంట్ ఫండ్ లో పొదుపు చేస్తూ వచ్చే ఉంటారు.

ప్రస్తుతం ఈ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో వాటిని కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.ఈ నేపథ్యంలో వారు ప్రతినెల దాచుకున్న ఈపీఎఫ్ మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవాలని చాలా మంది ఉద్యోగులు ప్రయత్నిస్తున్నారు.

ఇది ఇలా ఉండగా… కొంతమందికి మాత్రం విత్ డ్రా చేసే సమయంలో చాలా సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.దీంతో వారి పీఎఫ్ సెటిల్మెంట్ పూర్తి కావట్లేదు.అందుకే ఉద్యోగులు ఈ మొత్తానికి క్లైమ్ చేసుకునే సమయంలో కొన్ని వివరాలను సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి.ఒకవేళ ఈ విషయాలు కనుక ఏదైనా సరిగా లేకపోయినా సరే మీ పిఎఫ్ అమౌంట్ క్లియర్ కాదు.

ఇందుకు సంబంధించి మొదటగా యూనివర్సల్ అకౌంట్ నెంబర్ UAN యాక్టివేట్ చేసుకుని ఉండాలి.ఇలా వచ్చిన యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ను ఈపీఎఫ్ వెబ్సైట్ లో ముందుగా యాక్టివేట్ చేసుకోవాలి.

ఇది యాక్టివేట్ చేసుకోకపోతే మీ పిఎఫ్ అమౌంట్ క్లైమ్ చేసుకోలేము.ఇక ఆ తర్వాత కచ్చితంగా మీ పిఎఫ్ అకౌంట్ కు ఆధార్ నెంబర్ ను లింక్ చేసుకోవాలి.

ఆ తర్వాత సదరు పిఎఫ్ అకౌంట్ కి… మీ బ్యాంక్ అకౌంట్ జత చేసుకుని ఉండాలి.ఈ విషయాలు కరెక్ట్ గా ఉంటేనే మీ ప్రావిడెంట్ ఫండ్ క్లైమ్ సక్సెస్ అవుతుంది.

ఇందులో ఎటువంటి పొరపాటు జరిగినా మీ అమౌంట్ సెటిల్మెంట్ పెండింగ్ లోనే ఉంటుంది.

Telugu Aadhar Number, Employee, Phone Number-

ఎవరైతే పిఎఫ్ అకౌంట్ లో ఉన్న అమౌంట్ ను విత్ డ్రా చేసుకోవాలంటే ముందుగా వెబ్ సైట్ ను ఓపెన్ చేసుకొని, అందులో యుఏఎన్, అకౌంట్ కు సంబంధించిన పాస్ వర్డ్ లను ఎంటర్ చేసి.ఆ తదుపరి ఆన్లైన్ సర్వీస్ లో క్లైమ్ ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మీ పిఎఫ్ అమౌంట్ ను టైప్ చేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube