చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ కు కుక్కర్ ఆవిరితో చెక్ పెట్టచ్చు అంటూ వాట్సాప్ లో ఓ వీడియో హాల్ చల్ చేస్తోంది.ఆ వీడియో ఏంటి అనుకుంటున్నారా? అదేనండీ.కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు బయట నుండి ఏ వస్తువు తీసుకువచ్చిన శానిటైజర్ తో శుభ్రం చేస్తున్నారు.
అయితే శానిటైజర్ అనేది వస్తువులకు ఉపయోగించడం మంచిది కానీ తినే వస్తువులను, కూరగాయలను శానిటైజర్ తో శుభ్రం చెయ్యడం ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరం.
ఇంకా ఈ నేపథ్యంలోనే కొందరు నీటిలో వేసి కూరగాయాలను శుభ్రం చేస్తుంటే, మరికొందరు వేడి నీటిలో ముంచి తీస్తున్నారు.మరికొందరు ఉప్పునీటిలో కూరగాయలను, పండ్లను కడుగుతున్నారు.
ఇదంత ఇలా ఉండగా ఓ వ్యక్తి సరికొత్త విధానంలో కాయగూరలను శుభ్రం చేస్తున్నాడు.వేడి వేడి కుక్కరు ఆవిరితో కూరగాయాలను శుభ్రం చేస్తూ వైరస్ ఫ్రీ కూరగాయలను, పండ్లను చేస్తున్నాడు.
ఇంకా దీనికి సంబంధించిన వీడియో గత కొద్దీ కాలంగా వాట్సాప్ లో తెగ ఫార్వార్డ్ అవుతుంది.అయితే ఆవిరితో కరోనా వైరస్ చెక్ పెట్టచ్చు అని కానీ కుక్కరుతో ఇలాంటివి చేయడం ఎంతో ప్రమాదకరం.అందుకే ఇలాంటి వీడియోలు వచ్చినప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోండి.