వింత జీవి: 14 కాళ్లతో భయంకర రూపం

పశ్చిమ జావాలోని బాంటెక్‌ తీరంలో అరుదైన బొద్దింకను సింగపూర్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు.అయితే సింగపూర్‌కు చెందిన కొందరు పరిశోధకులు బాంటన్‌లో హిందూ మహాసముద్ర లోతులను పరిశోధిస్తున్నారు.ఈ క్రమంలో వారికి ఇండోనేషియాకు పశ్చిమంగా ఉన్న జావా వద్ద ఒక వింత జీవి కనిపించింది.2018లో కనిపించిన ఈ జీవి మీద మొన్నటివరకు పరిశోధనలు చేసి, అదొక కొత్త జీవి అని తెలుసుకున్నారు.

 Strange Creature, Rakshasa-cockroach, See-TeluguStop.com

అయితే ఇండోనేషియా నుంచి మొదటగా గుర్తించిన క్రస్టేసియా జాతి జీవి ఇదేనన్నారు.అలాగే పెద్దగా ఉంది కాబట్టి దీనికి ‘బాతినోమస్‌ రాక్సా (రాక్షస) అని పేరులో జోడించారు.

రాక్షస అంటే ఇండోనేషియన్ల భాషలో భారీగా ఉండేదని అర్థం.దీన్ని ముద్దుగా ‘కాక్రోచ్ ఆఫ్ ది సీ’ అంటే సముద్రపు బొద్దింక అని కూడా పిలుస్తున్నారు.

దీని గురించిన పూర్తి వివరాలను పరిశోధకులు.జూకీస్ పరిశోధక జీవవైవిధ్య జర్నల్‌లో ప్రచురించారు.

Telugu Cockroach, Raksasa-Latest News - Telugu

త్వరలోనే లోతుగా అధ్యయనం చేస్తామని పరిశోధకులు కానీ ఎమ్ సైడాబాలోక్, హెలెన్ పీ ఎస్ వాంగ్ తెలియజేశారు.మహాసముద్ర అడుగున చల్లగా ఉండే ప్రాంతాల్లో ఈ జీవి పెరుగుతుందన్నారు.పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాల్లోనూ ఇవి ఉండొచ్చని వారు తెలిపారు.అయితే ఈ జీవికి మొత్తం 14 కాళ్లు ఉన్నప్పటికీ కేవలం ముందు రెండింటితోనే సముద్రం అడుగున నేల మీద తిరుగుతుందని చెప్పారు.50 సెం.మీ.పొడవు పెరిగిన ఈ జీవి, ఇప్పటివరకు కనిపెట్టిన పెద్ద కీటక జాతి జీవుల్లో ఆరో స్థానంలో ఉందని వారు జర్నల్‌లో పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube