తెలుగు బుల్లితెర మీద ఇప్పుడిప్పుడే తన గలగల మాటలతో యాంకరింగ్ నిర్వహిస్తూ ప్రేక్షకులను బాగానే అలరిస్తున్న టాలీవుడ్ బ్యూటిఫుల్ యాంకర్ వర్షిణి సౌందరాజన్ గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియనివారుండరు. అయితే అందరి ఆర్టిస్టుల లాగే ఈ అమ్మడు కూడా కొత్తగా సినీ సినీ పరిశ్రమకు వచ్చినప్పుడు అవకాశాలను దక్కించుకోవడంలో కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ సౌత్ ఇండియాలో నెంబర్ వన్ డాన్స్ షో గా గుర్తింపు తెచ్చుకున్న ఢీ డాన్స్ షోలో వ్యాఖ్యాతగా వ్యవహరించే అవకాశం దక్కించుకున్నప్పటి నుంచి ఈ అమ్మడికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి.
అయితే ఈ మధ్య కాలంలో వర్షిణి ఒక పక్క యాంకరింగ్ నిర్వహిస్తూనే మరోపక్క ఫోటోషూట్స్ సంస్థలు నిర్వహిస్తున్న ఫోటో షూట్ కార్యక్రమాల్లో పాల్గొంటూ తన అందాలతో ఫోటోలకు ఫోజులు ఇస్తోంది.అంతేకాక ఈ ఫోటోలను తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ తన అభిమానులకు అందాల విందు చేస్తోంది.
అయితే ఈ మధ్య యాంకర్ వర్షిణి సినిమాలలో హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకునేందుకు కొంతమేర గ్లామర్ డోస్ పెంచినట్లు తెలుస్తోంది.
దీంతో కొందరు నెటిజన్లు సినిమాల్లో హీరోయిన్ గా ట్రై చేయొచ్చు కదా అంటూ యాంకర్ వర్షిని కి సలహాలు ఇస్తున్నారు.
అంతేగాక కొందరు సినీ క్రిటిక్స్ కూడా సినిమా పరిశ్రమలో ఒకపక్క యాంకరింగ్ నిర్వహిస్తూనే పలు చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తూ అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు పోవాలంటూ యాంకర్ వర్షిణి కి సూచిస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం యాంకర్ వర్షిని ఈ టీవీ ప్లస్ లో ప్రసారమయ్యే పలు కామెడీ షో లలో యాంకరింగ్ నిర్వహిస్తోంది.
అలాగే అతి బుధవారం రాత్రి 9 గంటల 30 నిమిషాలకు ప్రసారమయ్యే ఢీ జోడి కార్యక్రమంలో కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తు బాగానే ప్రేక్షకులను అలరిస్తోంది.