ప్రస్తుత కాలంలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు చూస్తుంటే రానురాను మానవ సంబంధాలకి విలువ లేకుండా పోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.వదిన అంటే అమ్మ తర్వాత అమ్మ అని అందరూ అంటారు .
కానీ ఆ వదిన స్థానంలో ఉండి ఓ మహిళ చేసిన పనికి వదిన అనే
మాటకి తలంపులు
తెచ్చింది. తాజాగా ఓ వివాహిత తన ఆడపడుచు ని ఇంట్లో ఉంచుకోవడం ఇష్టం లేక మినార్ బాలిక అని కూడా కనికరం లేకుండా ఏకంగా వ్యభిచార ముఠా కి అమ్మేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే 16 సంవత్సరాలు కలిగినటువంటి ఓ మైనర్ బాలిక స్థానిక జిల్లాకు చెందిన ఒంగోలు పట్టణ పరిసర ప్రాంతంలో తన కుటుంబ సభ్యులతో నివాసముంటోంది.అయితే ఈ క్రమంలో తన అన్న వదినలతో గత కొద్ది కాలంగా ఉంటుంది.
అయితే తే తన ఆడపడుచు ని తనతో పాటు ఇంట్లో ఉంచుకోవడం ఇష్టం లేనటువంటి బాలిక వదిన మైనర్ బాలికను వ్యభిచారం నిర్వహించే సభ్యులకి డబ్బు తీసుకొని అమ్మేసింది.దీంతో దిక్కు తోచని స్థితిలో ఉండిపోయిన మైనర్ బాలిక ఇతరుల సహాయంతో పోలీసులకు ఫోన్ చేసి ఈ విషయం గురించి తెలియజేసింది.
వెంటనే అప్రమత్తం అయినటువంటి పోలీసులు బాలిక ఉన్నటువంటి వ్యభిచార గృహానికి వెళ్లి బలవంతంగా మినార్ బాలికలతో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠాను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.అంతేగాక బాలికను దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ సంరక్షణ ఆలయానికి తరలించారు.
ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే వైరల్ అవుతుంది.దీంతో కొంత మంది నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ మైనర్ బాలికని కూడా చూడకుండా బాలికలు వ్యభిచార ముఠా కి అమ్మేసిన బాలిక వదిన పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు.