తెలుగులో ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్యకాలంలో బయోపిక్ లు, అడల్ట్ తరహా కథలు, వాస్తవిక సంఘటనలు తదితర అంశాలపై దృష్టి సారించి తన తదుపరి చిత్రాలను తెరకెక్కిస్తున్నాడు.అయితే ఇటీవలే టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జీవిత గాథ ఆధారంగా “పవర్ స్టార్” అనే చిత్రానికి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.
అయితే ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ అభిమానులు అసలు మద్దతు ప్రకటించడం లేదు.దీనికితోడు పవన్ కళ్యాణ్ గురించి పవర్ స్టార్ చిత్రంలో నెగిటివ్ గా రామ్ గోపాల్ వర్మ చూపించబోతున్నాడని ఇప్పటివరకు విడుదల చేసిన ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు చెప్పకనే చెబుతున్నాయి.
దీంతో ముల్లుని ముల్లుతోనే తీయాలని మన పెద్దలు చెబుతున్న సామెతను బట్టి రామ్ గోపాల్ వర్మ కి చిత్రానికి చిత్రంతోనే సమాధానం చెప్పాలని అన్నట్లుగా వెంటనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ “డేరా బాబా” అనే వెబ్ సిరీస్ ని తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు.ఇందులో టాలీవుడ్ కమెడియన్ మరియు హీరో షకలక శంకర్ హీరోగా నటిస్తున్నాడు.
అయితే షకలక శంకర్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని.దీనికితోడు గతంలో షకలక శంకర్ కామెడీ పరంగా రామ్ గోపాల్ వర్మను బాగానే ఇమిటేట్ చేస్తూ ప్రేక్షకులను అలరించిన సందర్భాలు ఉన్నాయి.
అందువల్లనే డేరా బాబా వెబ్ సిరీస్ లో రామ్ గోపాల్ వర్మ పాత్రకి షకలక శంకర్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే రామ్ గోపాల్ వర్మ జీవిత గాథ ఆధారంగా “పరాన్న జీవి” అనే కొత్త చిత్రాన్ని కూడా కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రకటించారు.
అయితే ఈ పరాన్న జీవి చిత్రానికి బిగ్ బాస్ కంటెస్టెంట్ నూతన నాయుడు దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం.అయితే రామ్ గోపాల్ వర్మ మాత్రం తన జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ పరాన్న జీవి, డేరా బాబా వెబ్ సీరీస్ చిత్రాల గురించి మాత్రం ఇప్పటివరకు స్పందించ లేదు.