బాహుబలి సినిమా పేరుతో సైబర్ నేరగాళ్ళ వల

ఆన్లైన్ లో ఫ్రీగా సినిమా చూడొచ్చు అంటే చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు.అందుకే సినిమాలు పైరసీ చేస్తూ ఆన్లైన్ లో అప్ లోడ్ చేసే కొన్ని వెబ్ సైట్స్ కి మంచి పాపులారిటీ ఉంది.

 Cyber Criminals Use Celebrity Names To Lure Victims, Cyber Crimes, Ott, Free Mov-TeluguStop.com

ఆ వెబ్ సైట్ నుంచి సినిమాలు విపరీతంగా డౌన్ లోడ్ చేసుకుంటూ ఉంటారు.అయితే ఇప్పుడు ఇలా ఫ్రీ సినిమాలు అని ఆశపడితే కొత్త సైబర్ ప్రమాదాలలో ఇరుక్కునే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సైబర్ నేరగాళ్ళు ఇప్పుడు కొత్త రకం మోసాలకి తెరతీస్తున్నారు.ఓటీటీల రంగప్రవేశంతో కొన్ని రకాల వీడియో కంటెంట్ ను డబ్బులు చెల్లించి చూడాల్సి వస్తుంది.

అయితే డబ్బులు చెల్లించకుండా ఉచితంగా అదే కంటెంట్ అందించే వేదికలకు కొదవలేదు.చాలా మంది ఈ ఫ్రీ కంటెంట్ కోసం గూగుల్ లో విపరీతంగా సెర్చ్ చేస్తూ ఉంటారు.

దీనినే ఇప్పుడు సైబర్ నేరగాళ్లు తమకు అనువుగా మలుచుకుంటున్నారు.ఉచిత కంటెంట్ కోసం సెర్చ్ చేసే నెటిజన్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్ళు వారికి కావాల్సిన వీడియో కంటెంట్లు అయిన బాహుబలి, లవ్ ఆజ్ కల్, గల్లీ బాయ్, మర్దాని 2, చపాక్ వంటి సినిమా పేర్లుతో వారికి గాలం వేస్తున్నారు.

ఈ సినిమాలు ఫ్రీగా చూడాలంటే ఈ వెబ్ సైట్స్ కి వెళ్ళండి అంటూ లింక్ లు పంపిస్తున్నారు.ఒక వేళ ఆ లింక్ ఓపెన్ చేస్తే దాని ద్వారా మాల్వేర్ వైరస్ ని డౌన్ లోడ్ అయ్యేలా చేసి పాస్ వర్డుల నుంచి వ్యక్తిగత సమాచారం మొత్తం హ్యాకర్ల తస్కరిస్తున్నారు.

తరువాత ఆ డేటా ఉపయోగించుకొని బ్లాక్ మెయిల్ చేయడం చేస్తున్నారు. ప్రముఖ సైబర్ సెక్యూరిటీ ఉత్పత్తుల సంస్థ మెకాఫీ వెల్లడించింది.

ఫ్రీ వీడియో కంటెంట్ కోసం వెతికే యూజర్లు ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube