మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్త నిర్మాణంలో బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఉప్పెన, ఫిషర్ మెన్స్ సొసైటీ నేపధ్యంలో ప్రేమకథా చిత్రంగా ఉప్పెన సినిమాని బుచ్చిబాబు ఆవిష్కరించారు.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది.
రిలీజ్ కి రెడీ అయిన లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.ఈ సినిమాలో విలన్ గా తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటిస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి సాంగ్స్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు.అలాగే విలన్ గా చేస్తున్న విజయ్ పాత్రని కూడా పరిచయం చేసారు.
ఇందులో విజయ్ హీరోయిన్ తండ్రిగా నటిస్తున్నట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళంలో కూడా విజయ్ క్రేజ్ నేపధ్యంలో రిలీజ్ చేయాలని సుకుమార్ భావించాడు.
అయితే ఇప్పుడు ఈ సినిమాని తాను తమిళంలో రీమేక్ చేసుకుంటానని విజయ్ సేతుపతి అడగడంతో తమిళ వెర్షన్ ని ఆపేశారు.ఇప్పటికే విజయ్ సేతుపతి రీమేక్ రైట్స్ సొంతం చేసుకొని తమిళంలో స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టించినట్లు టాక్.
ఈ సినిమా కథ అతనికి భాగా నచ్చడంతో తానే నిర్మాతగా తమిళంలో ఉప్పెన సినిమాని తెరకెక్కించాలని నిర్ణయించుకోవడంతో సుకుమార్ టీం వెనక్కి తగ్గినట్లు సమాచారం.ఇక తెలుగులో విలన్ గా విజయ్ చేసిన పాత్రని తమిళంలో కూడా అతనే చేస్తాడని తెలుస్తుంది.
అయితే క్లైమాక్స్ లో విజయ్ సేతుపతి ఇమేజ్ కి తగ్గట్లు కాస్తా మార్పులు చేసి హీరోయిజం తీసుకొచ్చే విధంగా డిజైన్ చేస్తున్నట్లు సమాచారం.