ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వేరు పడిన తర్వాత హైదరాబాద్ తెలంగాణకి వచ్చేసింది.ఇక ఏపీకి హైదరాబాద్ స్థాయిలో నగరాలు లేకపోయినా విశాఖపట్నం వాణిజ్య రాజధానిగా అవతరించింది.
ఇక విశాఖ నుంచి కార్యకలాపాలు కూడా విస్తరించాయి.వాణిజ్య సంస్థలు కూడా విశాఖలో తన వ్యాపారాలు విస్తరించేందుకు ఆసక్తి చూపించారు.
రైలు, రోడ్డు, వాటర్, ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ ఉన్న ఒకే ఒక్క ప్రాంతం విశాఖ కావడం కలిసొచ్చే అంశం.ఇప్పటికే సముద్రం ద్వారా ట్రాన్స్ పోర్ట్ విశాఖ నుంచి జరుగుతుంది.
ఈ నేపధ్యంలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకి గత ప్రభుత్వం భోగాపురంని కేంద్రంగా ఎంచుకుంది.గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి భూసేకరణ కూడా అయిపొయింది.
ఇక దీనిని అభివృద్ధి చేస్తే అంతర్జాతీయ వాణిజ్య, వర్తకంతో పాటు ప్రయాణానికి కూడా సులభతరం అవుతుంది.
ఈ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి లెటర్ ఆఫ్ అవార్డు దక్కించుకున్నట్టు జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రకటించింది.
రెగ్యులేటరీ ఫైలింగ్‌లో జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఈ విషయాన్ని తెలిపింది.పబ్లిక్–ప్రైవేట్ పార్టనర్‌షిప్ బేసిస్‌లో 2019 ఫిబ్రవరిలో ఈ ప్రాజెక్ట్‌కు వేసిన బిడ్డర్లలో హైయ్యస్ట్ బిడ్డర్‌గా జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ నిలిచింది.
ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా 40 ఏళ్ల వరకు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ డిజైన్, ఫైనాన్స్, కన్‌స్ట్రక్షన్, డెవలప్‌మెంట్, అప్‌గ్రేడెషన్, ఆపరేషన్, మెయింటనెన్స్ వంటి వన్నీ జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్సే చూసుకోనుంది.కార్గో ట్రాఫిక్ విషయంలో ఇండియాలో కస్టమ్స్ ఎయిర్‌పోర్ట్‌ల్లో వైజాగ్ ఎయిర్‌పోర్ట్ ఐదో స్థానంలో నిలిచింది.
ఇక భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణంకి కాంట్రాక్ట్ సొంతం చేసుకున్నట్లు ప్రకటించడంతో జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి.ఇప్పటికే ఇండియాలోనే ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ని జీఎంఆర్ గ్రూప్ నిర్మించింది.
ఆ అనుభవంతో ఇప్పుడు భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేసే అవకాశం సొంతం చేసుకుంది.