చత్తీస్ ఘడ్ లో భారీ ఎన్ కౌంటర్... 17 మంది జవాన్లు మృతి

ఓ వైపు కరోనాతో దేశం మొత్తం భయంతో వణికిపోతుంది.ప్రజలందరూ ఇళ్లకే పరిమితం అయ్యి జనతా కర్ఫ్యూకిలో పాల్గొన్నారు.

 Chhattisgarh Naxal Encounter Jawans-TeluguStop.com

ప్రభుత్వానికి అండగా ఉన్నారు.మరో వైపు విధి నిర్వహణలో పోలీసులు, డాక్టర్లు అవిశ్రాంతంగా పని చేస్తున్నారు.

ఇలాంటి సమయంలో చత్తీస్ ఘడ్ సరిహద్దులో భద్రతా దళాలకి భారీ ఎదురుదెబ్బ తగిలింది.సుక్మా జిల్లా లో మావోయిస్టులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏకంగా 17 మంది జవాన్లు మృతి చెందారు.

ఎన్‌కౌంటర్‌ జరిగిన సుక్మాలోని మింపా అడవుల్లో 17 మంది జవాన్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలియజేశారు.

నిన్నటి నుంచి ఎన్‌కౌంటర్ జరుగుతుందని ఈ ఎన్ కౌంటర్ తర్వాత 12 మందికి పైగా జవాన్లు మిస్‌ అయ్యారని, గాయపడ్డ వారిని రాయ్‌పూర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

ఇక అడవుల్లో గాలింపు చర్యలు చేపట్టగా ఇప్పటి వరకు పదిహేడు మంది జవాన్ల మృతదేహాలు లభ్యమయ్యాయని పేర్కొన్నారు.చింతగుఫ ప్రాంతంలోని కోరజ్‌గూడ కొండల్లో నిన్న మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం వరకు పలుమార్లు భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నట్టు ఆయన తెలిపారు.

ఇక ఈ ఎన్ కౌంటర్ లో ఇంకెంత మంది చనిపోయి ఉంటారు అనేది పూర్తిగా గాలింపు అయ్యేంత వరకు చెప్పలేమని డీజీపీ తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube