సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో తన నెక్ట్స్ మూవీని రెడీ చేసే పనిలో పడ్డాడు మహేష్.
కాగా తన నెక్ట్స్ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నట్లు అప్పట్లోనే అనౌన్స్ చేశాడు మహేష్.
అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా ఈ సినిమా మరోసారి డైలమాలో పడ్డట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి.ఈ సినిమా కోసం వంశీ చెప్పిన పూర్తి స్క్రిప్టు మహేష్‌కు నచ్చలేదట.
దీంతో వంశీని పూర్తిగా కథను మార్చాల్సిందిగా కోరాడట.అయితే వంశీ పూర్తి కథను మార్చాలంటూ సమయం పడుతుందని అన్నాడట.
దీంతో వంశీతో సినిమాను ప్రస్తుతానికి మహేష్ పక్కనబెట్టాడంటూ కొన్ని వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి.ఒకవేళ వంశీతో సినిమాను నిజంగానే పక్కనబెడితే మహేష్ ఎవరితో సినిమా చేస్తాడనే అంశం ఆసక్తిగా మారింది.
మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.