జగన్‌.. దీన్ని ఉన్మాదం కాక మరేమంటారు.. సూటిగా ప్రశ్నించిన చంద్రబాబు!

ఏపీలో జగన్‌ సర్కార్‌ వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు.ప్రభుత్వ వేధింపులు, మీడియాపై ఆంక్షలు, ఇంగ్లిష్‌ మీడియం, అసెంబ్లీలో ముఖ్యమంత్రి, మంత్రుల తీరుపై బాబు అసహనం వ్యక్తం చేశారు.

 In Assembly Hall Chandrababucomments On Jagan Mohan Reddy-TeluguStop.com

మీడియాపై ప్రభుత్వ ఆంక్షలను వివరించడానికి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు.

Telugu Chandrababu, Assemblyhall, Jagan Ycp, Tdp Chandrabbau-

ప్రభుత్వ వేధింపుల వల్లే మాజీ స్పీకర్‌ కోడెల ఆత్మహత్య చేసుకున్నారు.ఇప్పటి వరకూ టీడీపీ కార్యకర్తలపై 650 దాడులు జరిగాయి.జర్నలిస్టులపైనా దాడులు జరుగుతున్నాయి.

తునిలో ఓ విలేకరిని హత్య చేశారు.చీరాలలో మరో జర్నలిస్ట్‌పై హత్యాయత్నం చేశారు.

నెల్లూరులో జమీన్‌ రైతు ఎడిటర్‌పై దాడి చేశారు.మరి దీనిని ఉన్మాద ప్రభుత్వమంటే ఎందుకు మీకంత కోపం వస్తోంది అంటూ సీఎం జగన్‌ను చంద్రబాబు ప్రశ్నించారు.

ఇంగ్లిష్‌ మీడియంపై ప్రతిపక్షంలో ఉన్నపుడు, అధికారంలో ఉన్నపుడు రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు.ఏ విద్యార్థిపై బలవంతంగా ఏదీ రుద్దకూడదన్నదే తమ అభిప్రాయమని, రెండు మీడియాలను అందుబాటులో ఉంచాలని డిమాండ్‌ చేస్తున్నట్లు బాబు చెప్పారు.

ఇక అసెంబ్లీలో స్పీకర్‌, మంత్రులను పూర్తిగా డమ్మీగా మార్చేశారని ముఖ్యమంత్రి జగన్‌పై బాబు మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube