తెరపైకి 'ప్రత్యేక హోదా' జగన్ కు ఎంతో ఇబ్బందే కదా !

ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే అంటూ గతంలో జరిగిన ఉద్యమాలు ఎన్నికల సమయంలో ఆగిపోయాయి.అప్పట్లో వైసీపీ దీన్ని సమర్ధవంతంగా వాడుకుని లాభపడింది.

 Once Again Ap Special Status Issue Bring Back To Tdp-TeluguStop.com

అయితే ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ బాగా కార్నర్ అవ్వడమే కాకుండా ఒకరకంగా పార్టీ ఓటమిచెండానికి కూడా కారణం అయ్యిందనే చెప్పాలి.ఈ విషయంలో వైసీపీ అలుపెరగకుండా పోరాటం చేసింది.

ఆ సందర్భంగా వైసీపీ నాయకులూ, కార్యకర్తలు కేసులు కూడా ఎదుర్కొన్నారు.ఇక ఆ పార్టీ ఎంపీలు కూడా మూకుమ్మడిగా రాజీనామా చేసి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఢిల్లీ కేంద్రంగా పోరాటం చేశారు.

మొత్తానికి ప్రత్యేక హోదా డిమాండ్ ను వైసీపీ బాగానే వాడుకుంది.ఇక ఇప్పుడు ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది.

కేంద్రంలో అదే బీజేపీ ఉంది.అయితే ఇప్పుడు ఇదే అంశాన్ని ఉపయోగించుకుని వైసీపీని ఇరుకున పెట్టడంతో పాటు తమకు అనుకూలంగా మార్చుకోవాలని తెలుగుదేశం తదితర పార్టీలు భావిస్తున్నాయి.

Telugu Ap Status, Cmjagan, Ap Status Tdp, Tdp Chandrababu, Ycp Staus-

ప్రస్తుతం వైసీపీ – బీజేపీ పార్టీల మధ్య రాజకీయ వైరం కొనసాగుతోంది.కేంద్రంతో సఖ్యతగా ఉంటూ తమకు కావాల్సిన పనులు చేయించుకోవాలని ఆలోచనలో జగన్ ఉన్నాడు.అందుకే బీజేపీ ఏపీ నాయకులు ఎంత కవ్వింపు చర్యలకు దిగినా జగన్ మాత్రం సైలెంట్ గానే ఉంటున్నాడు తప్ప బీజేపీని విమర్శించే సాహసం అయితే చేయలేకపోతున్నాడు.ఇదే అదునుగా భావిస్తున్న టీడీపీ ఏపీలో ప్రత్యేక హోదా కోసం పోరాడిన మేధావి చలసాని శ్రీనివాస్ ను రంగంలోకి దించినట్టు తెలుస్తోంది.

Telugu Ap Status, Cmjagan, Ap Status Tdp, Tdp Chandrababu, Ycp Staus-

ఈ మేరకు ఆయన హోదా కోసం పోరాటం చేస్తామని ప్రకటన కూడా విడుదల చేసాడు.ఈ ఉద్యమం కనుక మొదలయితే టీడీపీ అందులో యాక్టివ్ పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది.ఇప్పటివరకు ఈ విషయంలో పేటెంట్ మాదే అన్నట్టుగా ఉన్న విఏసీపీ కూడా దీనిపై ఏదో ఒక క్లారిటీ ఖచ్చితంగా ఇవ్వాల్సిన పరిస్థితి.ఒకరకంగా ఇది జగన్ కు చాలా ఇబ్బందికర పరిణామమే.

ఎందుకంటే హోదా ఉద్యమానికి వైసీపీ మద్దతు తెలిపితే బీజేపీ ఆగ్రహం జగన్ చవిచూడాల్సి వస్తుంది.

Telugu Ap Status, Cmjagan, Ap Status Tdp, Tdp Chandrababu, Ycp Staus-

ఎటు చూసినా ఈ పరిణామాలు జగన్ కు తీవ్ర ఇబ్బందుకు తీసుకురావడం గ్యారంటీ.ఏపీ ఆర్ధిక పరిస్థితి ప్రస్తుతం అంతంతమాత్రంగానే ఉంది.లోటు బడ్జెట్ తో ఉన్న ఏపీకి కేంద్ర సహకారం కూడా తప్పనిసరిగా కావాల్సి ఉంది.

దీనికోసమైన ప్రత్యేక హోదా విషయంలో జగన్ ముందుకు కానీ వెనక్కి కానీ వెళ్లలేని సంకట పరిస్థితి నెలకొంది.ఇది రాజకీయంగా కూడా జగన్ కు చెడ్డ పేరు తెచ్చే ప్రమాదమూ ఉంది.

అందుకే ఈ విషయంలో ఏ విధంగా స్పందించాలి అనే విషయంపై పార్టీ సీనియర్లతో జగన్ మంతనాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.ఏమైనా ఈ ఉద్యమం మొదలయితే ఎక్కువ లాభపడేది మాత్రం తెలుగుదేశం మాత్రమే అనే విషయం స్పష్టంగా అర్ధం అవుతోంది.

రాబోతున్న ఈ ప్రత్యేక హోదా తుఫాన్ ను జగన్ ఎలా తట్టుకుంటాడో అనేది పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతోంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube