విడ్డూరం : అప్పుడు కూలర్లు పెట్టారు, ఇప్పుడు ముక్కుకు మాస్క్‌లు కడుతున్నారు, వీళ్లను ఏమనాలో మీరే చెప్పంది

ఇండియన్స్‌ సెంటిమెంటల్‌ ఫూల్స్‌ అంటూ విదేశాల్లో టాక్‌ ఉంటుంది.సెంటిమెంటల్‌ ఫూల్స్‌ కాదు కాని సెంటిమెంట్‌ ఎక్కువగా ఉండేవారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

 Here Utar Pradesh Gods Wear Masks To Escape From Air Pollution-TeluguStop.com

ఇండియన్స్‌కు సెంటిమెంట్స్‌ ఎక్కువగా ఉంటాయి కనుకే మన దేశంను ఎన్నో దేశాలు అబిమానిస్తాయి గౌరవిస్తాయి.మన దేశంలో పాటించే సాంప్రదాయాలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది.

అలాంటప్పుడు సెంటిమెంటల్‌ ఫూల్స్‌ అంటూ మనను అన్నా కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

Telugu Air, Delhi Control, Uttarpradesh, Gods Wear Mansk, Indian Temples-

ఇక మన దేశంలో హిందూ దేవాలయాల్లో కొన్ని సార్లు జరుగుతున్న పనులను చూస్తుంటే నవ్వు వస్తుంది.అలాగే మన సాంప్రదాయం ఎంత గొప్పది అన్నట్లుగా అభిప్రాయం కలుగుతుంది.గతంలో వేసవి కారణంగా విపరీతమైన ఎండలు వచ్చిన సమయంలో దేవాలయాల్లో కూలర్లు మరియు ఫ్యాన్స్‌ పెట్టారు.

దేవుడికి చెమట పోస్తుందని, దేవుడు వేడిని తట్టుకోలేక పోతున్నాడు అంటూ కూలర్లను పెట్టి అప్పట్లో వైరల్‌ చేశారు.ఉత్తరప్రదేశ్‌లోని పలు దేవాలయాల్లో ప్రభుత్వం స్వయంగా కూలర్లను ఏర్పాటు చేయించిందట.

Telugu Air, Delhi Control, Uttarpradesh, Gods Wear Mansk, Indian Temples-

ఇప్పుడు ఉత్తర ప్రదేశ్‌లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది.ఢిల్లీ తర్వాత యూపీలో అత్యధిక కాలుష్యం ఉందని వాతావరణ శాఖ ఒక నివేదికలో వెళ్లడించింది.ఆ నివేదిక ప్రకారం ఉత్తర ప్రదేశ్‌ రోడ్లపై ఒక గంట మాస్క్‌ లేకుండా తిరిగితే మరుసటి రోజు అనారోగ్యంతో మంచం ఎక్కాల్సింది.అందుకే అక్కడ మాస్క్‌లు లేకుండా బయటకు రావడం లేదు.

ఇదే పద్దతిని దేవుడికి కూడా అక్కడి పూజార్లు పాటిస్తున్నారు.

Telugu Air, Delhi Control, Uttarpradesh, Gods Wear Mansk, Indian Temples-

యూపీలోని పలు దేవాలయాల్లో మూల విరాట్‌ విగ్రహాల ముక్కులకు మాస్క్‌లు కడుతున్నారు.కొందరు దీన్ని తప్పుబడుతుంటే వారు మాత్రం సమర్ధించుకుంటున్నారు.కాలుష్యం అనేది మనుషులకు మాత్రమే కాదు దేవుళ్లను కూడా ఇబ్బంది పెడుతుందని అంటున్నారు.

అప్పుడు ఎండలకు కూలర్‌ పెట్టాం ఇప్పుడు కాలుష్యంకు మాస్క్‌లు పెడుతాం.దాంట్లో తప్పేమి లేదు అంటున్నారు.

మన ఇబ్బందులను దేవుడు చూసుకుంటూ ఉంటే మనం ఆయనకు సమస్యలు రాకుండా జాగ్రత్తగా చూడాలంటూ ఆలయ పూజారులు చెబుతున్నారు.దేవుళ్లకు మాస్క్‌ విషయంలో మీ అభిప్రాయం ఏంటీ, వారిని ఏమనాలో మీరు కామెంట్‌ రూపంలో మాకు చెప్పండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube