విచిత్రం: 40 ఏళ్ల లో 44 మందికి జన్మనిచ్చింది!

ఒకప్పుడు పిల్లలు ఇద్దరు లేక ముగ్గురు,నలుగురు ముద్దు అనే వారు పెద్దవాళ్లు.కానీ ఇప్పుడు ఒకరు లేక ఇద్దరు ముద్దు అంటున్నారు.

 Uganda40years Oldlady Give Birthto44 Kids-TeluguStop.com

చాలా మంది అయితే ఒక్కరికే ఆగిపోతున్నారు అనుకోండి.అమ్మమ్మల కాలం లో మాత్రం 12 మంది లేదంటే 9 మంది ఇలా పెద్ద సంఖ్యలోనే పిల్లలను కనేవారు.

అంత మందిని ఎలా పోషించారు అన్న విషయానికి వస్తే మాత్రం పెద్ద ఆశ్చర్యంగా ఉంటుంది ఈ తరం వారికి.ఎందుకంటే ఇద్దరు పిల్లలను ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల ప్రకారం పెంచి పోషించడం అంటే ఎంత కష్టమో అందరికీ తెలిసిందే.

వారికి మంచి విద్యాబుద్ధులు నేర్పించాలి అన్నా,ఒక గౌరవప్రదమైన హోదా లో నిలబెట్టాలి అంటే ఆ తల్లి దండ్రులు ఎంత కష్టపడాల్సి వస్తుందో చెప్పనవసరం లేదు.కానీ ఈ మహిళ గురించి వింటే మాత్రం మీరు ఒక్కసారిగా నోరెళ్లబెడతారు.

ఇంతకీ ఆ మహిళ గొప్ప ఏంటి అని అనుకుంటున్నారా.ఆమె ముగ్గురు,నలుగురు కాదు ఏకంగా 44 మంది పిల్లలకు జన్మనిచ్చింది.

ఆశ్చర్యపోతున్నారా నిజంగానే ఆమె వయసు ఇప్పుడు 40 ఏళ్లు కాగా ఇప్పటివరకు ఆమె కడుపునా 44 మంది పుట్టారు.ఈ విషయం తెలుసుకున్న అక్కడ ప్రభుత్వం కూడా ఆమె పిల్లలను కనడం ఆపేయాలి అంటూ ఆదేశాలు కూడా జారీ చేసింది.

ఇంతకీ ఇది ఎక్కడ అన్న విషయానికి వస్తే ఉగాండా లో చోటుచేసుకుంది.ఉగాండా కు చెందిన మరియం అనే మహిళ కు ఒక అరుదైన సమస్య ఉంది.

ఆమె అండాశయాలు పెద్దగా ఉండడం తో ఆమె ఒకేసారి ముగ్గురు,నలుగురు కు కూడా జన్మనిచ్చే అవకాశాలు ఉండడం తో ఆమెకు ఇలా 40 ఏళ్ల వయసులో 44 మంది ని కనగలిగినట్లు తెలుస్తుంది.అయితే ఇక ఆమెను అలా వదిలేస్తే అర్ధ శతకం పూర్తి చేస్తుంది అని భావించిన ఉగాండా ప్రభుత్వంఇక ఆమె పిల్లలను కనడం ఆపాలని ఆమె గర్భాశయాన్ని తొలగించాలని ఆదేశించింది.మరియంకు 12 ఏళ్లకే పెళ్లి జరిగింది.13వ ఏటే ఆమెకు కవల పిల్లలు జన్మించారు.దీంతో ఆమె వైద్యులను సంప్రదించి గర్భ నివారణ చేయాలని కోరింది.ఈ సందర్భంగా ఆమెకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు అది సాధ్యం కాదని చెప్పారు.పైగా ఆమె అండాశయాలు చాలా పెద్దవని, భవిష్యత్తులో మరింత మంది కవలలు పుట్టే అవకాశం ఉందన్నారు.చివరికి వైద్యులు చెప్పినట్లే ఆ తర్వాత 5 సార్లు కవలలు, ఏడు సార్లు ముగ్గురేసి, ఐదుసార్లు నలుగురేసి పిల్లలకు జన్మనిచ్చింది.

అలా 40 మందికి ఆమె జన్మనిచ్చింది.వీరిలో కొందరు పుట్టగానే చనిపోవడంతో ప్రస్తుతం 38 పిల్లలే ఉన్నారు.

మూడేళ్ల కిందట భర్త ఆమెను వదిలేశాడు.దీంతో ఆ 38 మంది పిల్లలను పోషించే బాధ్యత ఆమెపైనే పడింది.

వారిని పోషించడానికి రోజుకు సుమారు 25 కిలోల గోదుమ పిండి ఖర్చవుతుందని ఆమె ఓ వార్త సంస్థకు వెల్లడించింది.వారిని పోషించడానికి రెక్కలు ముక్కలు చేసుకుంటున్నానని తెలిపింది.

మళ్లీ గర్భం దాల్చితే తన ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు చెప్పారనిఎం అంతేకాకుండా తన గర్భాశయం తొలగించడం అంత సులభమైన పని కాదని వైద్యులు చెప్పారని తెలిపింది.

Telugu Lady Give, Telugu Ups-

  చిత్రం ఏమిటంటే.ఆ 38 పిల్లలను ఆమె ఎంతో ప్రేమగా చూసుకుంటుంది.స్కూల్‌కు పంపి చదివిస్తోంది.

ఆ ఇంట్లో గోడలపై మెడల్స్ సాధించిన తన చిన్నారుల ఫొటోలు గర్వంగా పలకరిస్తాయి.ఈమె పరిస్థితి చూసి ప్రభుత్వం ఆదుకోడానికి ప్రయత్నిస్తోంది.

అయితే.ఇకపై పిల్లలను కనకూడదనే షరతు విధించింది.

ప్రపంచంలో అత్యంత పేదరికాన్ని అనుభవిస్తున్న దేశాల్లో ఉగాండా కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube