జనసేనలోకి సినీనటుడు “ప్రకాష్ రాజ్”

జనసేనకి రోజు రోజుకి సినీ నటుల మద్దతు పెరుగుతూ వస్తోంది.పవన్ కళ్యాణ్ అంటే ఎంతో కమిట్మెంట్ ఉన్న పర్సన్ అటువంటి వ్యక్తీ రాజకీయాల్లోకి రావాలి అనుకోవడం ఎంతో మంచి పరిణామం అంటున్నారు సినీ నటులు.

 Actor Prakash Raj Will Join Soon In Janasena Party-TeluguStop.com

అలీ ,శివబాలాజీ,శివాజీ , అన్న నాగబాబు,సంపూర్నేషు బాబు ఇలా చెప్పుకుంటు పొతే పవన్ కళ్యాణ్ కి మద్దతు ఇస్తున్న వారి లిస్టు రోజు రోజుకి పెరుగుతోంది తప్ప తరగడం లేదు.తాజాగా పవన్ కళ్యాణ్ కి నేను కూడా మద్దతు ఇస్తున్నాను అంటూ విలక్షణ నటుడు ,నిర్మాత ,దర్శకుడిగా ఇలా ఎన్నో రంగాలలో సేవలు అందిస్తున్న ప్రకాష్ రాజ్ కూడ ముందుకు వస్తున్నారు…అంతేకాదు పవన్ కళ్యాణ్ పై సంచలన కామెంట్స్ కూడా చేశాడు

జాతీయ మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో రాజకీయాలు ,సినిమాలు ఇలా కొన్ని రకాల ప్రశ్నలకి సమాధానం ఇచ్చాడు.

ఇది ప్రజా స్వామ్య పాలన తప్పు ఎవరు చేసినా అడిగే హక్కు మనకి ఉంది దానిని ఎవరు ఉపయోగించడం లేదు అంటూ చెప్పుకొచ్చారు…అలాగే ఇతడి సన్నిహితుడు, ఆప్తుడు అయిన కమల్ హాసన్ రాజకీయలపై కూడా స్పందించారు.నాకు రాజకీయాలు అంటే పెద్దగా ఆసక్తి లేదని.

కానీ ఆ పార్టీ గురించి.పార్టీ విధానాల గురించి కమల్ హాసన్ నాతో చర్చించలేదు అని చెప్పాడు

కమల్ పార్టీలో నేను చేరను అని చెప్పాడు.

ఇక జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ .పవన్ పార్టీ గురించి నేను తెలుసుకున్నాను.తానూ తీసుకుంటున్న నిర్ణయాలు ఎంతో బాగున్నాయి.తన వాళ్ళ ప్రజలకి మేలు జరుగుతుంది తప్ప కీడు జరగదు అనేది తన గట్టి నమ్మకం అని చెప్తున్నాడు.

అంతేకాదు పవన్ గురించి అంతా తెలుసు ఆయన ఆశయాలు చాలా గొప్పవని చెప్పుకొచ్చాడు.పవన్ పార్టీ విధానాలు నచ్చితే నేను ఆయనతో పాటు ఆ పార్టీలో కలిసి నడవడానికి సిద్దం అని చెప్పుకొచ్చారు.

తన మద్దతు ఎప్పుడు పవన్ కళ్యాణ్ కి ఉంటుంది అని చెప్పారు ప్రకాష్ రాజ్

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube