తెలంగాణా విద్యార్ధులకి ఉద్యోగాల కోసం ఏర్పాటు చేసిన కొలువుల కొట్లాటకి విశేష స్పందన వచ్చింది.కేసీఆర్ ప్రభుత్వం మీద విద్యార్ధులకి ఉన్న అసహనం ఈ వేదిక ద్వారా నిరూపితం అయ్యింది.
ప్రభుత్వంతో మా కొట్లాట ఎక్కడి వరకూ అయినా సరే ఉంటుంది అంటూ విద్యార్ధి లోక గళమెత్తి చాటి చెప్పింది
ఈ కొట్లాట సభకి ప్రముఖ అడ్వకేట్ రచనా రెడ్డి వచ్చారు.ఆమె తనదైన శైలిలో టీఆర్ఎస్ ప్రభుత్వం పై విరుచుకు పడ్డారు…ప్రభుత్వంలో ఉండి విద్యార్థులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారికి.
ఈ కొట్లాట వల్ల ఎక్కిళ్లు రావాలని విద్యార్ధులకి రచనా రెడ్డి సూచించారు.సరూర్ నగర్ లో జరుగుతున్న కొట్లాట సభలో పాల్గొన్న ఆమె యువతను ఉద్దేశించి ఎంతో భావోద్వేగ ప్రసంగం చేశారు
ఉద్యోగాల కోసం మన యువత చావాల్సిన అవసరం లేదు.
ఎంతో మంది ప్రాణాలు ఒడ్డి తెచ్చుకున్న ఈ తెలంగాణా రాష్ట్రంలో.ఉద్యోగాలను అనుభవించే హక్కు మీకు మాత్రమే ఉందని విద్యార్థులకు దైర్యం చెప్పారు.
కావాలని ప్రభుత్వం చట్టవ్యతిరేకంగా నోటిఫికేషన్లు జారీ చేసి వాటి గురించి ప్రశ్నిస్తే నోటిఫికేషన్లకు అడ్డుపడుతున్నారని తమపై నింద వేస్తున్నారన్నారు.ప్రభుత్వానికే చిత్తశుద్ది ఉంటే ఎలాంటి లొసుగులు లేకుండా ఉద్యోగ ప్రకటన చేపడితే కోర్టే వాటిని స్వీకరించదన్నారు.
ఇలాంటి సమయంలో ఎలాంటి వారు నోటిఫికేషన్ కి అడ్డుపడినా సరే నియామకాలు ఆగవు అని చెప్పారు.అయితే అలాంటి నోటిఫికేషన్ ఇచ్చే దమ్ము టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు
ఉద్యోగాలని అడ్డుకోవాల్సిన అవసరం మాకు లేదు మేము ఎక్కడా ద్వంద్వ వైఖరి ప్రదర్శన చేయడం లేదు అంటూ ప్రభుత్వానికి ఘాటుగా బదులిచ్చారు.
ఆత్మహత్యలు చేసుకుంటే ఎలా.మన సమస్యలని మనమే పరిష్కరించుకోవాలి అంటూ విద్యార్ధులకి ధైర్యం చెప్పారు.ప్రభుత్వాన్ని కొలువులు ఇస్తరా లేక చస్తరా అని ప్రశ్నించే సమయం వచ్చేసింది అన్నారు.రచనా రెడ్డి తనదైన శైలిలో ప్రసంగం చేస్తుంటే విద్యార్ధుల వైపు నుంచీ.ఈలలు.నినాదాలతో ఆమె ప్రసంగానికి అశేష స్పందన లభించింది…మీ వెనుక మేము ఉన్నాం అంటూ ఆమె చెప్పిన మాటలు విద్యార్ధుల్లో ధైర్యాన్ని నింపాయి.