ఆడవాళ్ళ అందానికి మరింత అందాన్ని ఇచ్చేలా పలు రకాల పౌడర్లు, పేస్ ప్యాక్ లు , ముల్తాన మట్టి, ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక సౌదర్య సాధానాలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త హంగులతో మార్కెట్ లోకి వస్తు ఉంటాయి.నిజానికి చెప్పాలంటే ఇప్పుడు జరుగుతున్న బిజినెస్ అంతా ఆడవారిని దృష్టిలో పెట్టుకుని చేసేవే.
ఆడవాళ్ళు చేతి వేళ్ళు అందంగా కనపడటానికి పలు రకాలైన నెయిల్ పాలిష్ లు ఉపయోగిస్తారు.అనేక రకాలైన రంగులు కుడా చేతి వేళ్ళకి వాడేస్తూ ఉంటారు.తరువాత గోళ్ళకి ఉన్న రంగులు పోకపోవడం వలన నెయిల్ పాలిష్ ను తొలగించుకోవడానికి చాల కష్టాలు పడుతుంటారు.మళ్ళీ వాటిని పోగొట్టడానికి ఏవో క్రీమ్స్ లోషన్స్ వాడుతారు అలాంటివి వాడటం వలన గోళ్ళు పాడవుతాయి.
గోళ్ళు పాడవకుండా ఉండటానికి కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు.
కొద్దిగా టూత్ పేస్టూ ని తీసుకుని గోళ్ళపై రాసి తరువాత కాటన్ తో నెమ్మదిగా రుద్దితే గోళ్ల మీద వున్న రంగు పోతుంది.
పాతబడిపోయిన నెయిల్ పాలిష్‌ను తీసుకొని గోళ్లపై పోయాలి.మొత్తంగా నెయిల్‌పాలిష్ సులువుగా తొలగిపోతుంది.అలాగే వెనిగర్ తో గోళ్ళపై ఉన్న రంగును తొలగించుకోవచ్చు.కాటన్ బాల్ ను తీసుకుని వెనిగర్ లో ముంచి గోళ్లపై రుద్దాలి.
గోరువెచ్చని నీటిలో గోళ్ళని ముంచి పది నిమిషాలు తరువాత తీసివేసి కాటన్ తో తుడిస్తే చాలు.