శరీరంలో ఏదైనా బాగంలో చర్మం అధికంగా పెరిగితే చర్మ టాగ్లు అని పిలుస్తారు.స్కిన్ టాగ్లు అపాయకరం కాని కణితులు మరియు ఇవి తరచుగా మెడ చర్మం మడతలు,బాహుమూలము మరియు తొడలలో పెరుగుతాయి.
అంతేకాక ఇవి కనురెప్ప, ముఖం లేదా చేతుల సమీపంలో ఆకస్మికంగా పెరిగి చాలా ఇబ్బందిని కలిగిస్తాయి.అయితే వీటి పెరుగుదలకు ఎటువంటి ఖచ్చితమైన కారణం లేదు.
అయితే జన్యుశాస్త్రం, హార్మోన్ల మార్పులు, అలెర్జీలు మరియు స్థూలకాయం వంటివి కారణాలుగా చెప్పవచ్చు.వీటిని కొన్ని ఇంటి నివారణల ద్వారా తొలగించవచ్చు.
ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
1.ఆపిల్ సైడర్ వెనిగర్:
ఆపిల్ సైడర్ వెనిగర్ చర్మ టాగ్లు తొలగించుకోవటానికి ఒక మంచి పరిష్కారం.మొదట ప్రభావిత ప్రాంతాన్ని సబ్బుతో శుభ్రం చేసి పొడిగా తుడవాలి.
ఒక కాటన్ బాల్ ని ఆపిల్ సైడర్ వెనిగర్ లో ముంచి ప్రభావిత ప్రాంతంలో వృత్తాకార మోషన్ లో రాయాలి.ఈ విధంగా ప్రతి రోజు అనేక సార్లు రాస్తే మంచి పలితం కనపడుతుంది.
2.టీ ట్రీ ఆయిల్:
పురాతన కాలం నుండి టీ ట్రీ ఆయిల్ ని చర్మ టాగ్లు మరియు అనేక చర్మ సమస్యల చికిత్సలో వాడుతున్నారు.మొదట ప్రభావిత ప్రాంతాన్ని సబ్బు నీటితో శుభ్రపరచి పొడిగా తుడవాలి.ఒక గ్లాస్ నీటిలో కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ వేసి బాగా కలిపి ఒక కాటన్ బాల్ ముంచి ప్రభావిత ప్రాంతంలో వృత్తాకార మోషన్ లో రాయాలి.ఈ విధంగా ఒక వారం పాటు చేస్తే మంచి పలితం కనపడుతుంది.
3.నిమ్మరసం:
నిమ్మరసంలో సిట్రిక్ ఆమ్లం ఉండుట వలన క్రమం తప్పకుండా ఒక వారం పాటు ఉపయోగిస్తే మంచి పలితం కనపడుతుంది.తాజా నిమ్మరసాన్ని పిండి కాటన్ బాల్ సాయంతో ప్రభావిత ప్రాంతంలో రాయాలి.
ప్రతి రోజు క్రమం తప్పకుండా ఈ విధంగా చేస్తే మంచి పలితం కనపడుతుంది.