అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ట్రంప్‌కు షాకిచ్చిన సర్వే, 64 శాతం మంది వ్యతిరేకంగానే..!!

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి అప్పుడే అమెరికాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.ఆశావహులంతా అధ్యక్ష బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు.

 64% Of Americans Will Not Vote For Donald Trump In 2024 Poll Results, Florida Go-TeluguStop.com

ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్( Joe Biden ), మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లు( Donald Trump ) ఇప్పటికే తాము అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.వీరితో పాటు డెమొక్రాటిక్, రిపబ్లిక్ పార్టీలలో వున్న కొందరు ప్రముఖులు కూడా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించగా.

ఇంకొందరు కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు.

రిపబ్లికన్‌ పార్టీలో కీలక నేతగా వున్న ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్( Florida Governor Ron DeSantis ) కూడా అధ్యక్ష బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.

వీరితో పాటు మాజీ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్, సౌత్ కరోలినా సెనేటర్ టిమ్ స్కాట్, మాజీ ఐక్యరాజ్యసమితి రాయబారి నిక్కీ హేలీ, న్యూజెర్సీ మాజీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ, ఇండో అమెరికన్ బిలియనీర్ వివేక్ రామస్వామిలు ఆ పార్టీ నుంచి అదృష్టం పరీక్షించుకుంటున్నారు.

Telugu Americansvote, Americans, Donald Trump, Floridagovernor, Joe Biden, Repub

అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన వారి ప్రదర్శనపై అక్కడి సంస్థలు ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తూ.ఎవరు ముందంజలో వున్నారో చెబుతున్నాయి.ఈ నేపథ్యంలో తాజాగా విడుదల చేసిన ఓ సర్వే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు షాకిచ్చింది.

దాదాపు 64 శాతం మంది అమెరికన్లు ఆయన పట్ల వ్యతిరేకంగా వున్నారని సర్వే పేర్కొంది.ట్రంప్ .రిపబ్లికన్ పార్టీలోని తన ప్రత్యర్ధులందరి కంటే మెరుగ్గా వున్నప్పటికీ సాధారణ ఎన్నికల ఫలితాలు ఆయనకు దిగ్భ్రాంతిని కలిగించవచ్చని ‘‘అసోసియేటెడ్ ప్రెస్ – ఎన్‌వోఆర్సీ సెంటర్ ఫర్ పబ్లిక్ అఫైర్స్ రీసెర్చ్ ’’ అంచనా వేసింది.

Telugu Americansvote, Americans, Donald Trump, Floridagovernor, Joe Biden, Repub

ట్రంప్ నేరారోపణలను ఎదుర్కోవడం ప్రారంభించినప్పుడు ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ వ్యతిరేకత 55 శాతంగా వుండేది.రిపబ్లికన్ల మద్ధతుతో ట్రంప్ దూసుకెళ్తుండగా.సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ఆయనకు గట్టి పోటీ ఎదురవ్వొచ్చని , మెజార్టీ అమెరికన్లు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా నిలబడతారని సర్వే ఫలితాలు స్పష్టంగా సూచిస్తున్నాయి.

అయితే 74 శాతం మంది రిపబ్లికన్లు ఆయనకు నవంబర్ 2024లో మద్ధతు ఇస్తారని తెలిపింది.ట్రంప్ అధికారికంగా రిపబ్లికన్ పార్టీ ( Republican Party )నామినీ అయితే ఇప్పుడు 53 శాతం మంది, 2024 నవంబర్‌లో 11 శాతం మంది ఆయనకు మద్ధతు ఇవ్వరని సర్వే అంచనా వేసింది.

ఈ సర్వే ఫలితాలు ట్రంప్ ప్రత్యర్ధుల వాదనలను బలపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.నిజానికి 2016 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓట్ల ప్రచారంలో ఓడిపోయాడు.కానీ ఎలక్టోరల్ కాలేజీలో మెజారిటీతో అధ్యక్ష పగ్గాలు అందుకున్నాడు.అయితే 2020 అధ్యక్ష ఎన్నికల్లో మాత్రం డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధి జో బైడెన్ చేతిలో దాదాపు 7 మిలియన్ల ఓట్ల తేడాతో ట్రంప్ ఓటమి పాలయ్యాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube