2023 ముగిసింది.2024 సంవత్సరం మొదలయ్యింది.కాగా గత ఏడాది ఎన్నో సినిమాలు విడుదల అందులో కొన్ని డిజాస్టర్ గా నిలిస్తే మరికొన్ని బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.అయితే టాలీవుడ్ కు 2024 చాలా క్రేజీగా ఉండబోతోంది.అందులో అణుమాత్రం సందేహం లేదు.2024 లో సినిమాల జాతర జరగనుంది.2024లో ఎన్ని అట్రాక్షన్లో ఒకటి కాదు రెండు కాదు.చాలా అంటే చాలా ఉన్నాయి.
కొరటాల శివ-ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న దేవర( Devara Movie ) ఈ ఏడాదిలోనే ఇండియన్ వైడ్ బ్లాక్ బస్టర్ పుష్ప సీక్వెల్ పుష్ప 2 ( Pushpa 2 ) ఈ 2024లోనే.టాప్ డైరక్టర్ శంకర్ అందించే తొలి తెలుగు సినిమా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్( Game Changer ) కూడా ఈ సమ్మర్ లోనే.
అలాగే త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారం( Guntur Karam ) కూడా ఈ ఏడాది రానుంది.ఆయనే స్పెషల్ ఆయన సినిమాలు అంతకన్నా స్పెషల్ ఆయనే నాగ్ అశ్విన్. ఆయన ప్రపంచం మొత్తాన్నే తన సినిమాతో చుట్టేయబోతున్నాడు.అదే ప్రభాస్ – కల్కి.( Prabhas Kalki Movie ) ఈ అద్భతం ఈ ఏడాదే చూడబోతున్నాం.పవన్ కళ్యాణ్ కనుక పాలిటిక్స్ కాస్త పక్కన పెడితే ఓజి సినిమా( OG Movie ) చూడవచ్చు.
దీని కోసం పవన్ ఫ్యాన్స్ ఆశగా చూస్తున్నారు.మారుతి లాంటి మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు ప్రభాస్ తో సినిమా చేస్తున్నారు.
ఇది ఎలా వుండబోతోందో అన్న ఆసక్తి వుంది.
అదీ ఈ ఏడాదే.కార్తికేయ 2 లాంటి హిట్ కొట్టిన చందు మొండేటి ఈసారి సముద్రం మీదకు వెళ్లిపోయారు మరి నాగచైతన్యను తోడు తీసుకున ఏం చేస్తారో చూడాల్సింది కూడా ఈ ఏడాదినే.రొటీన్ గా వచ్చే భారీ సినిమాలు చాలానే ఉన్నాయి.
మెగాస్టార్, బాలయ్య, రవితేజ ఇలా జాబితా చాలా పెద్దదే వుంది.టాప్ హీరోల సినిమాలు మరిన్ని వుండనే వున్నాయి.
అవి 2024లో వస్తాయా అన్నది క్లారిటీ లేదు.బుచ్చిబాబు రామ్ చరణ్ ఇలాంటివి ఈ లైన్ లో వున్నాయి.
మొత్తం మీద 2024 మామూలుగా వుండబోవడం లేదు.టాలీవుడ్ ను ఒక దిశగా నడిపించబోతోంది.